ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  అయితే కొన్ని సంఘటనలు మాత్రం నిజంగా జనాలను భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి.  ముఖ్యంగా ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు.  ఎక్కడ చూసినా కరోనా గురించిన ముచ్చటే నడుస్తుంది.  చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిపోయిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ లో సైతం కలకలం సృష్టిస్తుంది. విదేశాల నుంచి వస్తున్నవారి కి  ఈ కరోనా వైరస్ ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే.  అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కరోనా వల్ల ప్రాణ నష్టం వాటిల్లలేదు కానీ.. కరోనా బాధితుల కేసులు మాత్రం నమోదు అవుతున్నాయి. 

 

ఇటీవల గాంధీ ఆసుపత్రిలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ టెక్కీ కరోనా బాధ నుంచి ఉపశమనం కలిగినట్లు వైద్యులు తెలిపారు.  ఇదిలా ఉంటే కరోనా భయం వల్ల జనాలు ఏదైనా విచిత్రమైన వస్తువులు కానీ.. విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులను చూసి గానీ ఆమడ దూరం వెళ్తున్నారు.  సాధారణంగా మనం ఏదైనా ఓ విచిత్రమైన వస్తువులను చూస్తే ఎంతగా భయపడతామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇలాంటివి  మీడియాలో బాగా చూపిస్తుంటారు.. అనుమానిత వస్తువులక దూరంగా ఉండండి.. వాటి వల్ల మీకు ప్రమాదం పొంచి ఉండొచ్చు అన్న సందేశాలు కూడా ఇస్తుంటారు. 

 

అయితే అలాంటి అనుమానిత వస్తువులు తారస పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తుంటారు.  తాజాగా  తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో పారాషూట్‌ ద్వారా వచ్చిన ఓ బాక్స్ కలకలం రేపింది. శర్లపూడి బాడవలో ఓ బాక్స్ మామిడి చెట్టుకు వేలాడుతూ గ్రామస్తులకు కనిపించింది.  అయితే ఆ బాక్సులో ఓ పెద్ద బాంబు ఉందని ముందుగా అక్కడి జనాలు భయపడిపోయారు.  వెంటనే పోలీసులకు సమాచా రం అందడంతో అక్కడికి చేరుకున్నారు. దానిని కిందకు దింపగా.. వాతావరణానికి సంబందించిన జీపీఎస్‌ అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: