ప్రపంచ దేశాల్లో కరోనా ఉదృత రూపం దాల్చింది. అలానే మన భారత్‌ లో కూడా మెల్ల మెల్లగా కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోంది. అయితే.. మంగళవారం కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. కాగా., కర్ణాటకలో 3కేసులు,  కేరళలో 6 కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేరళలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కేరళలో తాజాగా ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వైరస్ బారిన పడ్డారు. మంగళవారం నమోదయిన కేసులోని బాధితులు వారితో సన్నిహితంగా మెలిగినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 56 కి చేరింది.

 

 


 కేరళ సీఎం పినరయ్ విజయన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి థియేటర్లను మార్చి 31 వరకు మూసివేయాలని అన్నారు. ఇలా అయిన వైరస్ ను అదుపులోకి తెచ్చుకోవచ్చని, వైరస్ వేగంగా వ్యాపించకుండా ఉండేదుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.

 

 


ఇదిలఉండగా.. కర్ణాటకలో తొలి కరోనా కేసు సోమవారం నమోదైంది. వైరస్ సోకిన వ్యక్తి అమెరికా నుంచి దుబాయ్‌ మీదుగా బెంగుళూర్ కు వచ్చిన టెకీకి (40) కరోనా కన్ఫర్మ్ అయినట్లు కర్ణాటక మంత్రి కె.సుధాకర్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసిందే. కాగా., మార్చి 1న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్‌ కు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయిందని వెల్లడించారు. తాజాగా, మరో ఇద్దరికి కరోనా వైరస్ ఉన్నట్టు నమూనాల్లో వెల్లడయ్యింది.

 


రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా అనుమానితుల దృష్ట్యా అక్కడక్కడ 5 చోట్ల కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మంగళూరులోని ఓ వ్యక్తి  కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఆదివారం పారిపోవడం కలకలం రేపింది. అతను చికిత్స ముగియక ముందే బయటకు వెళ్లిపోవడంతో వైద్యశాఖ అధికారులు వెతికిపట్టుకుని బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: