ఆస్ట్రేలియా దేశం లోని మెల్బోర్న్ నగరంలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకొని అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. వివరాలు తెలుసుకుంటే... మెల్బోర్న్ నగరానికి చెందిన అన్నా లోంగానో అనే పేరుగల ఒక గర్భవతి కి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె ని తన భర్త ట్రెంట్, ఇంకా కుటుంబ సభ్యులు కలసి ఫ్రీ మ్యాన్షన్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటి లోపే ఆమెకు పురిటినొప్పులు ఎక్కువైపోయాయి. 

 

 

దాంతో ఆస్పత్రి సిబ్బంది ఒక స్ట్రక్చర్ పై ఆమెను పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్ కి తరలించడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆమెని ఒక లిఫ్టులో తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులతో సహా ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నిస్తుండగా... ఆ ఆసుపత్రి హాలులోనే అన్నా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆస్పత్రి హాల్ లో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ చూసేశారు. అలాగే ఆమె ప్రసవిస్తున్న దృశ్యాలు ఆస్పత్రిలోనే సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ రికార్డైన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

 


ఏది ఏమైనా ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే వైరల్ అయిన వీడియోలో కనిపించిన తల్లి ఒక ఆస్ట్రేలియన్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ... ' నిమిషము అయిపోగానే మరొక నిమిషమే నాకు పురిటి నొప్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ నొప్పి భరించలేక నేను కారులో ఎక్కేందుకు చేతులమీద పాక్కుంటూ వచ్చాను. నా కళ్ళు బయటకి పొడిచుకు వస్తూ తల నుండి ఊడి పడేటట్టు అనిపించింది. ముందుగానే ఆసుపత్రి సిబ్బందికి నా ఎమర్జెన్సీ పరిస్థితి గురించి నా భర్త చెప్పేసాడు. అందుకే ఆసుపత్రి నర్సులు నా కోసం ఎదురు చూసి నేను రాగానే నన్ను హుటాహుటిన ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లానని ప్రయత్నించారు కానీ హాలులోనే ప్రసవం జరిగి పోయింది', అంటూ ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: