ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) సంస్థ బయటపెట్టి అందరి నోరేళ్ళబెట్టేలాగా చేస్తుంది. 2004 నుండి 2019 ఆర్థిక సంవత్సరాల మధ్యలో ఏడు పార్టీలు రూ. 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని తేలింది. అయితే 2018 నుంచి 2019 వరుకు రూ. 2512.98 కోట్లు విరాళాలు వచ్చాయి.




ఆ మొత్తంలో భారతీయ జనతా పార్టీ కి 64 పర్ సెంట్ అనగా రూ. 1, 612.04 కోట్ల విరాళాలు అందాయి. అయితే అన్ని పార్టీలు కలసి సేకరించిన విరాళాలు(రూ.900.94కోట్లు) కంటే భారతీయ జనతా పార్టీ ఒకటిన్నర రెట్లు ఎక్కువగా సంపాదించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ డేటా ప్రకారం... కాంగ్రెస్ నేషనల్ పార్టీ మొత్తం విరాళాలలో 24% అనగా రూ. 728.88 కోట్లను సేకరించింది.




ఇకపోతే 20 వేల కంటే తక్కువ విరాళం అందించిన వారి పేర్లు నమోదు చేయరు ఇంకా పాటిస్తే ఇన్కమ్ టాక్స్ అలాంటివి ఏమీ ఉండవు. కానీ 20 వేల కంటే ఎక్కువ విరాళ దారుల పేరు కచ్చితంగా నమోదు చేయాలి. కానీ పార్టీలో మాత్రం 20 వేల కంటే ఎక్కువ వచ్చిన వారి పేర్లను నమోదు చేయకుండా కొన్ని వందల కోట్ల విరాళం అక్రమంగా తీసుకున్నారని లెక్కలు అసలు చూపించడం లేదని ఐటీశాఖ ఆరోపణలు చేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్, సేల్ అఫ్ కూపన్స్, ఇతర ఇన్కమ్, రిలీఫ్ ఫండ్ రూపంలో ఉండగా వాటిని అజ్ఞాత మార్గాల ద్వారా సంపాదించిన మొత్తం అని అంటారు. ఐతే అజ్ఞాత మార్గల ద్వారా రూ. 1960 కోట్ల విరాళాలు వచ్చినట్టు ADR సంస్థ తెలిపింది. కానీ బీఎస్పి మాత్రం తమకే అజ్ఞాత మార్గాల ద్వారా ఎటువంటి విరాళంగా అందలేదని చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: