గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కొత్త సొబగులు దిద్దుకుంటుంది. నిన్న, మెన్నటి వరకు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, ఇప్పుడు హడావిడిగా నిర్మాణం జరుగుతుంది..ఇతరత్రా మౌళిక సదుపాయాలు కూడా రెడీ అయిపోతున్నాయి..ప్రజల సమస్యలను 15ఏళ్లుగా పాటు పట్టించుకోని అధికారులు ఇప్పుడు కొత్త పాలక వర్గం వస్తుండటంతో రోడ్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

 

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15ఏళ్ల తరువాత గుంటూరు నగర పాలక సంస్దకు ఎన్నికలు జరుగుతున్నాయి.. జనరల్ క్యాటగిరి కోటాలో జరుగుతున్న ఎన్నికలలో అధికార పార్టీ నుండి పెద్ద ఎత్తున ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 

 

గుంటూరు నగర పాలక సంస్ద లో ఇప్పుడు హడావిడిగా రోడ్ల నిర్మాణం చేపట్టారు.తెల్లవారే సరికి ప్రధాన రహదారులు అన్ని కళ కళ లాడిపోతున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో దశాబ్దాలుగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని అధికారులు యుద్దప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపట్టారు. 

 

గతంలో చినుకుపడితే చాలు గుంటూరు రోడ్లన్నీ చెరువులను తలపించేయి..గోతుల రోడ్లతో సామాన్యులకు నడిరోడ్డు ప్రయాణం సాహసంగా మారిన పరిస్దితులు.. అయితే ఇప్పుడు నగర పాలక సంస్దకు ఎన్నికల హడావిడి మెదలు కావటంతో నోటిఫికేషన్ కు ముందుగానే రహదారుల నిర్మాణం అతి వేగంగా జరిగిపోయాయి. 

 

ఒకప్పుడు గుంటూరు అంటేనే గుంతలూరు అనే పేరు వచ్చింది.కాని ఎన్నికలు పుణ్యమాని రోడ్లన్నీ నిర్మాణం చేపట్టారు.ఊహించని రీతిలో ఎన్నికల హడావిడి ఏర్పడటంతో సమయం కూడ లేక ఎక్కువ శాతం రహదారులు నిర్మాణం జరగలేదు..ప్రధాన రహదారుల  నిర్మాణం చేపట్టారు. 

 

గుంటూరు నగరం నుండి బాపట్ల,నరసరావుపేట,పత్తిపాడు,చీరాలకు వెళ్ళాల్సిన ప్రధాన రహదారులు కూడ అత్యంత దారుణంగా ఉన్నాయి..రోడ్లన్నీ ద్వంసం అయ్యాయి..రహాదారి ప్రయాణం తీవ్ర ఇబ్బందిగా మారింది.మరో వైపున హడావిడిగా రోడ్ల నిర్మాణం వలన నాణ్యత ఎంత మేర ఉంటుందన్నది కూడ స్దానికుల నుండి వ్యక్తం అవుతున్న ప్రశ్న.

 

ఎన్నికల ముందు హడావిడిగా నిర్మాణం చేపట్టం చూస్తుంటే,వచ్చే పాలకుల కోసం ప్రజలు స్వాగతం చెబుతున్నట్లుగా ఉందని గుంటూరు జనం చమత్కరిస్తున్నారు.మరి 15ఏళ్ల తరువాత ఏర్పడబోతున్న నగర పాలక సంస్ద నూతన పాలకులు,  అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను ఎంత మేర పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: