స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ వస్తే కాస్త కష్టపడ్డా.. తర్వాత సెలవులు వస్తాయన్న సంబరంతో ఉంటారు.  ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎప్పుడు సెలవు వస్తందా.. హాయిగా ఇంట్లో ఆడుకుందామా అన్న ఆలోచనలో ఉంటారు.  ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుందంటే.. ఒంటిపూడ బడి కోసం ఎదురు చూస్తుంటారు.  ఒక్కపూట స్కూల్ కి వెళ్లి హాయిగా ఇంటి వద్ద ఆడుకోవొచ్చు అని పిల్లలు అనుకుంటారు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఉన్న విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలలు పాక్షికంగా సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.  అయితే తుమ్ములు, దగ్గు, జ్వరం వచ్చిన విద్యార్థులను ఇంటి వద్ద రెస్ట్ తీసుకొని స్కూల్ యాజమాన్యాలు సైతం సూచనలు ఇస్తున్నారు.  సాధారణంగా మార్చి తర్వాత ఎండలు బాగానే ముదిరిపోతుంటాయి.

 

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒంటిపూట బడులు నిర్వహిస్తూ వస్తోంది ప్రభుత్వం. కానీ ఇప్పుడు తెలంగాణలో చల్లటి వాతావరణం కనిపిస్తుంది.. అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే ఈ సమయంలో పిల్లకు ఒంటిపూట బడులు  నిర్వహించాలా వద్దా అన్న విషయంపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రారామచంద్రన్‌ ప్రకటించారు.  ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్కూల్స్  టైమింగ్స్ ఉంటాయని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

 

మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం చేశాకా విద్యార్థులను ఇంటికి పంపించాలని తెలిపారు. దాంతో పిల్లల్లో ఆనందం మొదలైంది.. అయితే ఇప్పుడు కరోనా భయంతో ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది.. బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఒకవేళ పంపినా మాస్క్ లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది.   అలాగే ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి స్కూల్స్ కు వేసవి సెలవులు ఉంటాయని.. జూన్‌ 12న తిరిగి ప్రారంభం కానున్నాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: