స్నేహానికి అన్ను మిన్ను లేదంటారు. బాధ అయినా సంతోషంమైన మొదట మిత్రులతోనే పంచుకుంటాము. అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు. స్నేహితుడే తన మిత్రుడికి ప్రాణహాని కలిగించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. 

 

ఖమ్మం జిల్లాలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు భూపాలపల్లి అడవుల్లో స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆనంద్ రెడ్డి హత్య వెనుక ఇసుక మాఫియాలో కీలక పాత్ర పోషించే టీఆర్ఎస్ నేత సోదరుడి హస్తం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

 

అంతకుముందు ఆనంద్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈనెల ఏడో తేదీన ఆనంద్ రెడ్డి, తన స్నేహితుడు ప్రదీప్‌రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. అయితే అప్పటి నుంచి ఆయన తిరిగి ఇంటికి రాలేదు ఆ రోజు నుంచి నాలుగు రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఆనంద్ రెడ్డి అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమలాపూర్‌కు చెందిన ఓ ఇసుక కంట్రాక్టర్ ఆనంద్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

పోలీసులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకోని దర్యాప్తు చేపట్టారు. భూపాలపల్లి అడవి దగ్గర ఆనంద్ రెడ్డి ఫోన్ సిగ్నల్ నిలిచిపోయినట్టు గుర్తించారు. అక్కడ సమీపంలోనే ఆనంద్ రెడ్డి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆనంద్ రెడ్డిని అతడి స్నేహితుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: