అధికారపార్టీ వర్గాలు చెబుతున్నదాని ప్రకారమైతే  ఈనెలాఖరులోపు జగన్మోహన్ రెడ్డికి నరేంద్రమోడి తీపికబురు చెప్పబోతున్నారట. ఇక్కడ తీపికబురంటే శాసనమండలిని రద్దు చేయటమే. మండలి రద్దు విషయంలో జగన్ చాలా పట్టుదలతో ఉన్నారు. ఇదే విషయమై ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోం శాఖమంత్రి అమిత్ షా తో కూడా జగన్ మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో జగన్ తో రాజ్యసభలో మోడికి  ఉన్న అవసరం కూడా మండలి రద్దు ప్రక్రియ స్పీడందుకుంటుందట.

 

అసెంబ్లీ ఆమోదించిన  సిఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను శాసనమండలిలో టిడిపి కంపు చేసేసింది. మండలిలో మెజారిటి ఉందన్న ఏకైక కారణంతోనే  రెండు బిల్లుల విషయంలో చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు తమ శాడిజాన్ని చూపించారు. మామూలుగా రెండు బిల్లులను ఓడగొట్టుంటే ఇంత సమస్య ఉండకపోను.  అయితే మండలి ఛైర్మన్ ఎం ఏ షరీఫ్ తమ మనిషే అన్న ధీమాతో నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటికి పంపుతున్నట్లు ప్రకటింపచేశారు. దీంతో సమస్య మొదలైంది.

 

ఛైర్మన్ ప్రకటన దగ్గర నుండి రెండు పార్టీల మధ్య వివాదం అనేక మలుపులు తిరిగి బాగా పీటముడి పడిపోయింది. దాంతో చంద్రబాబు, యనమల శాడింజతో ఒళ్ళుమండిపోయిన జగన్ చివరకు మండలి రద్దుకే పట్టుబట్టాడు. దీని ఫలితంగానే మండలిని రద్దు చేస్తు అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపింది. జగన్ ఫాలో అప్ చేసినందు వల్ల కేంద్ర హోంశాఖ నుండి లా డిపార్ట్ మెంటు తర్వాత కేంద్ర క్యాబినెట్ సెక్రటరికి వెళ్ళి అక్కడి నుండి మోడి కార్యాలయానికి చేరుకుందట.

 

మామూలుగా అయితే రద్దు బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకోవటానికి కనీసం మూడేళ్ళు పడుతుందని చంద్రబాబు చాలా సార్లే చెప్పాడు. కానీ జగన్ దెబ్బకు బిల్లు చాలా స్పీడుగా ప్రాసెస్ అవుతోంది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు రద్దును ప్రవేశపెడతారని అంటున్నారు. సిఏఏ లాంటి వివాదాస్పద అంశాలు గనుక లేకపోతే ఈ పాటికే బిల్లు అజెండాగా పార్లమెంటుకు వచ్చేదే అని అంటున్నారు. ఏదేమైనా ఈనెలాఖరులోగా మండలి రద్దుకు పార్లమెంటు పచ్చజెండా ఊపటం ఖాయమనే పార్టీ వర్గాలంటున్నాయి. అందుకనే జగన్ కు మోడి తీపి కబురు చెబుతారని అంచనా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: