వైఎస్ కుటుంబానికి కడప జిల్లా రాజకీయాలలో తిరుగులేదు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినా గాని జగన్ కుటుంబానికి కడప జిల్లాలో తిరుగేలేదు. అందులోనూ పులివెందుల అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎలాంటి సందర్భంలో అయినా పులివెందుల ప్రజలు ఎప్పుడు వైయస్ కుటుంబాన్ని అండగా నిలబడడం జరిగింది. అటువంటి నియోజకవర్గంలో జగన్ కుటుంబాన్ని ఢీ కొట్టడం కోసం ఎన్నో ఏళ్ల నుండి ప్రయత్నం చేస్తున్న రాజకీయ నాయకుడు సతీష్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నింటినీ పులివెందులలో దగ్గరుండి చూసుకునే సతీష్ రెడ్డి ఇటీవల వైయస్ జగన్ సమక్షంలో వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు.

 

ఆయనతోపాటు మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కూడా జాయిన్ అవబోతున్నాడు. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రామ సుబ్బారెడ్డి చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేయడం జరిగింది. తాజాగా వీరిద్దరు వైసీపీ పార్టీలో చేరబోతున్న తరుణంలో కడప జిల్లా రాజకీయాలలో వైయస్ కుటుంబానికి తిరుగులేకుండా పోయింది. అయితే వీళ్ళిద్దరిలో ఎక్కువగా సతీష్ రెడ్డి...వైయస్ జగన్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో గట్టి దెబ్బ వేయటం జరిగింది. ఈనెల 13వ తారీఖున వీళ్లంతా వైసీపీ పార్టీలో చేరబోతున్నారు. జగన్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

 

దీనితో ఒక్కసారిగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో అదనపు బలం వచ్చినట్టు అయింది. ఇప్పటికే జగన్ ఇక్కడ తిరుగులేని నేతగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో జగన్ కి అతి పెద్ద ఎనిమీ అయినా సతీష్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో...వైసీపీ పార్టీలోకి వస్తున్నట్లు జగన్ కి తెలియజేసిన తర్వాత రోజు  తెల్లవారగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వైసీపీ పార్టీలో టాక్. మరి సతీష్ రెడ్డి డిమాండ్ మేరకు జగన్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: