స్థానిక సమరానికి ముందే తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది . ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు కీలక నేతలు టీడీపీ ని వీడి, అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు . అయితే ఆలా చేరుతున్నవారు గాలివాటం నాయకులయితే టీడీపీ నాయకత్వం కూడా పెద్దగా పరిగణలోకి తీసుకునేది కాదేమో,  కానీ పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన నేతలు కూడా తమ దారి, తాము చూసుకుంటుండడమే ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని ఆందోళన గురి చేస్తోంది .

 

కడప జిల్లా లో టీడీపీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది . జమ్మలమడుగు ఇంచార్జ్ గా వ్యవహరిస్తోన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి , పులివెందుల ఇంచార్జ్ సతీష్ రెడ్డి లు టీడీపీ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకోవడం తో వారిని నిలువరించేందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది . అయితే ఇప్పటికే రామసుబ్బారెడ్డి , సతీష్ రెడ్డి లు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం .  పార్టీ అధికారం లో ఉన్న , లేకున్నా కడప జిల్లాలో వీరిద్దరూ టీడీపీ కి కీలక నేతలుగా కొనసాగుతూ వచ్చారు .

 

2014 టీడీపీ అధికారం లోకి వచ్చిన తరువాత చంద్రబాబు చేపట్టిన అపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి ని టీడీపీ లోకి ఆహ్వానించడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు . అయినా చంద్రబాబు పార్టీ బలోపేతాన్ని సాకుగా చూపెడుతూ , ఆదినారాయణ రెడ్డి కి పార్టీ కండువా కప్పడమే కాకుండా మంత్రి పదవి కట్టబెట్టారు . ఇది ఏమాత్రం రుచించని రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తి తో రగిలిపోయారు .

 

పార్టీ అధికారం లో ఉండడం వల్ల  చేసేదేమి లేక,  ఇబ్బంది అయినా టీడీపీ లోనే కొనసాగుతూ వచ్చారు . ఇక ఇప్పుడు టీడీపీ అధికారం లో లేకపోవడం , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించడం తో రామసుబ్బారెడ్డి  టీడీపీతో తనకున్న   సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడానికే రెడీ అయ్యారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: