మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు జ్యోతి రాదిత్య సింధియా. ఇచ్చిన ట్వీస్ట్ కి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. మేటర్ లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉండటంతో జ్యోతి రాదిత్య సింధియా తాజాగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ సభ్యులు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. బీజేపీ 107 మందితోపాటూ 17 మంది మద్దతు పొందితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఉప ఎన్నికలకు బిజెపి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 

కాగా ఈ ప్లానింగ్ అంతా బీజేపీ హైకమాండ్ నేతలు అయినా నడ్డా మరియు అమిత్ షా కలిసి వేయటంతో… అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పునాదులు మొత్తం కదిలి పోయాయి అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు కి జగన్ వేసి ఉంటే కనుక రాజకీయంగా చంద్రబాబు రాష్ట్రంలో కనుమరుగై పోయే వాళ్ళని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

అసెంబ్లీ స్టార్ట్ అయిన మొదటి రోజే ఇటువంటి సందర్భం గురించి జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు కి ప్రతిపక్ష పాత్ర లేకుండా చేసే ఛాన్స్ నాకు ఉంది, బట్ నేను అలా చేస్తే అతనికి నాకు తేడా ఏమీ ఉండదు అంటూ స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని జగన్ ఆనాడు స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ బీజేపీ మాదిరి వ్యవహరిస్తే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి ఎదురుగా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: