కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పిన జోతిరాధిత్య సింధియా బీజేపీ లో చేరనున్నారన్న ప్రచారం జరిగింది . అయితే సింధియా చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది . గురువారం ఆయన భోపాల్ లో తన అనుచరులైన 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి  కాషాయ కండువా కప్పుకుని ఛాన్స్ ఉన్నట్లు సమాచారం . అదే రోజు సింధియా, రాజ్యసభ కు నామినేషన్ వేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది . ఇప్పటికే బీజేపీ జాతీయనాయకత్వం ఈ మేరకు సింధియా ఆఫర్ ఇచ్చినట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి .

 

రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన సింధియా ను మోదీ తన కేబినెట్ లోకి తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది . కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కి అత్యంత  సన్నిహితుడైన సింధియా ఇచ్చిన స్ట్రోక్ కు ఆ పార్టీ  అధిష్టానానికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది . ఇక మధ్యప్రదేశ్ లో అధికార మార్పిడి అనివార్యంగా కన్పిస్తోంది . మొత్తం 230  స్థానాలున్న  మధ్యప్రదేశ్ అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజార్టీ తో అధికారాన్ని చేజిక్కించుకుంది . ఆ పార్టీకి 114 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా , అందులో  సింధియా అనుచరగణం దాదాపు 20  మందికిపైగానే  ఉంటారని తెలుస్తోంది . వీళ్లంతా సింధియా తో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు .

 

ఇక బీజేపీ కి 107 మంది సభ్యుల బలం ఉండగా , ఎస్పీ ఒక ఎమ్మెల్యే  , బీఎస్పీ ఇద్దరు  ఎమ్మెల్యేలు ఉన్నారు . వీరు కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు . అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో వీరి వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్ధకంగా మారింది .  సింధియా అనుచరులు కాంగ్రెస్ గుడ్ బై చెప్పి  బీజేపీ లో చేరితే , అప్పుడు బీజేపీ బలం దాదాపు 127 వరకు చేరుకునే అవకాశాలున్నాయి . దీనితో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయంగా కన్పిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: