తెలుగు చిత్ర పరిశ్రమలో జె.డి.చక్రవర్తి మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు జెడి చక్రవర్తి. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తాజాగా ఎన్నో ఏళ్ల తర్వాత జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఎమ్ఎమ్ఓఎఫ్. ఎన్ ఎస్ ఈ  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షిత, మనోజ్ నందn,  అక్షిత బెనర్జీ,  సంపూర్ణేష్ బాబు,  జబర్దస్త్ చమ్మక్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్  ప్రొడక్షన్స్ క్రియేషన్స్ పతాకంపై రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. 

 

 అయితే ఏ విషయంలో అయినా ఎవరూ ఊహించని విధంగా కాస్త డిఫరెంట్ గా  స్పందిస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. ఇక రామ్ గోపాల్ వర్మ ఏ చిన్న మాట మాట్లాడినా అది సెన్సేషనల్ గా మారిపోతూ ఉంటుంది ఆ విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్ఎమ్ఓఎఫ్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ  ఈ టైటిల్ మీనింగ్ ఏంటో తనకు అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ ట్రైలర్ ని రూపొందించిన విధానం మాత్రం ఎంతగానో బాగుంది అని ప్రశంసించాడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమా ట్రైలర్ మొత్తం పదునైన కట్టింగ్స్ తో  అంటూ జెట్ స్పీడ్ లో ఉంది అంటూ రాంగోపాల్ వర్మ తెలిపాడు. 

 

 

 ఇక సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మకి అభిమానులకు తక్కువేం లేరూ కదా .అందుకే  రాంగోపాల్ వర్మ ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ గా మారుతు  ఉంటుంది. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ఎమ్ఎమ్ఓఎఫ్ టైటిల్ అర్థం కావట్లేదు అని చేసిన వ్యాఖ్యలపై అభిమానులు స్పందిస్తూ వివరించే ప్రయత్నం చేశారు. ఎంఎంఓఎఫ్ అంటే 70ఎంఎం అని చెప్పుకొచ్చారు నెటిజన్లు. 70ఎమ్ఎమ్  పేరును  రివర్స్ లో ఎమ్ఎమ్ఓఎఫ్ అని పెట్టారు అంటూ అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మరి  ఎంత వరకు నిజం అన్నది మాత్రం చిత్ర యూనిట్ కే తెలియాలి. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: