రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్.. ఆ ప్రత్యేకతలే వారిని నాయకులుగా నిలబెడుతుంటాయి. అదే సమయంలో పడకొడుతుంటాయి కూడా. చంద్రబాబు, జగన్ ల విషయాను గమనిస్తే ఈ విషయం మరింత చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల మేని ఫెస్టోల విషయంలో వీరిద్దరికీ చాలా తేడాలు ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో అంటే గెలిస్తే తాము ఏం చేస్తామో చెప్పే హామీ పత్రం గా భావించాలి.

 

 

మేని ఫెస్టో విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా లిబరల్ గా ఉంటారు. అన్నీ చేసేస్తానంటారు. సమాజంలోని ప్రతి వర్గానికి వరాలు ప్రకటిస్తారు. గెలిచినప్పుడు చూసుకుందాం లే.. అనే ధోరణి కనిపిస్తుంది. 2014 ఎన్నికల సమయంలో ఇది రుజువైంది. ఆయన ఆ సమయంలో దాదాపు 600 వరకూ హామీలు ఇచ్చారు. అప్పటికే పదేళ్లు అధికారానికి దూరం కావడంతో నోటికొచ్చిన హామీలు ఇచ్చారు.

 

 

అయితే వైఎస్ జగన్ ది ఇందుకు భిన్నమైన వైఖరి. ఆయన మాట ఇస్తే దాదాపు తప్పడం అంటూ ఉండదు. అందుకే 2019 ఎన్నికల్లో రుణ మాఫీ హామీ ఇస్తే అధికారంలోకి వచ్చేస్తామని పార్టీ నేతలు ఎంత మొత్తుకున్నా... వైఎస్ జగన్ వారి మాట వినలేదు. అమలు చేయలేని హామీలు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అప్పుడు జగన్ రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే.. అప్పుడే జగన్ సీఎం అయ్యేవాడని వైసీపీ నేతలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

 

 

ఇక చంద్రబాబు ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్‌ చేస్తే.. దాన్ని మళ్లీ ఎన్నికలు వచ్చాకే చంద్రబాబు బయటకు తీస్తాడని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. కానీ జగన్ మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించే నాయకుడు అని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ తొమ్మిది నెలల కాలంలోనే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ పూర్తి చేసిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు. ఆ మాటల్లో నిజం ఉందిగా మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: