ఊహించని ట్విస్ట్ లు ఎన్నోఇస్తూ, ప్రతిపక్షాలకు, ప్రజలకు జగన్ ఇస్తున్న హామీలు , షాకులు అన్నీ ఇన్నీ కాదు. తాము ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉండడంతో మరోసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో జగన్ ఉన్నారు. దీనికోసమే క్రమక్రమంగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని బలహీనం చేసే పనిలో జగన్ ఉన్నారు. మొన్నటి వరకు వైసీపీలోకి వచ్చేందుకు చాలా మంది నాయకులను జగన్ వెయిటింగ్ లో పెట్టారు. చూద్దాంలే అన్నట్టు గా వ్యవహరించారు. కానీ క్రమక్రమంగా టిడిపి బలం పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుండడంతో జగన్ ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. పార్టీలోకి వస్తానన్న వారిని చేర్చుకోవడంతో పాటు మిగతా పార్టీలో ఉన్న బలమైన, ప్రజా ఆకర్షణ ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. దానికి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అయితే వైసీపీలో మంచి ఊపు రావడంతో పాటు, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చినట్లు అవుతుందని జగన్ ఆలోచన. 

 

IHG

 

ఇప్పటికే విశాఖ నుంచి ఎస్ ఏ  రెహమాన్, గుంటూరు నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రకాశం జిల్లా నుంచి కదిరి బాబురావు వంటి వారు వైసీపీ లోకి వచ్చేలా జగన్ పావులు కదిపారు. ఇంకా అనేక మందికి జగన్ స్కెచ్ వేశారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు రఘువీరా రెడ్డిని వైసిపి లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. వైఎస్. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన రఘువీరా రెడ్డి ప్రజాకర్షణ గల నేత. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. దీంతో రఘువీరాను వైసీపీ లోకి తీసుకువచ్చి సముచిత స్థానం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. దీంతో అనంతపురం జిల్లాలో వైసిపి బలపడడంతో పాటు జేసీ, పరిటాల కుటుంబాలకు చెక్ పెట్టవచ్చని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. 


రఘువీరా రెడ్డి ఎన్నికలకు ముందు పార్టీలోకి వస్తే వైసీపీకి లాభం చేకూరుతుంది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే రఘువీరా రెడ్డికి 2022 లో రాజ్యసభ సీటు కూడా ఇచ్చేందుకు జగన్ ఆయనకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్, టిడిపి, జనసేన, బిజెపి ఇలా, ఏ పార్టీలో బలమైన నేతలు ఉన్నా వైసీపీలోకి వచ్చి చేరుతామని సంకేతాలు పంపించినా వారిని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీలో చేర్చుకోవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా తమ పార్టీ బలం పెంచుకోవడంతో పాటు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెక్ పెట్టినట్లే అవుతుందని జగన్ ఆలోచనగా తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: