ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని అటు హోమియోపతి వారు తాము దానికి మందు కనిపెట్టాము అంటూ అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తూ ఉంటే మరొకవైపు ఫేస్ మాస్కులు, శానిటైజర్ల వ్యాపారం జోరుగా జరుగుతోంది. ఇటువంటి సమయంలో లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు మాత్రం దీని యొక్క నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు వెల్లడిస్తూ…. మిగతావారంతా ప్రజల దగ్గర డబ్బులు గుంజుతుంటే వీరు మాత్రం వారికి డబ్బుని తిరిగి ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు. అది కూడా వారి బాగు కోసమే.

 

IHG

 

నిజానికి కరోనా వైరస్ ఇప్పటివరకు లక్ష మందికి పైగా సోకితే అటూ ఇటుగా ఒక 30 వేల మంది చనిపోయారు. అంటే కరోనా సోకిన వారందరిలో మరణించేది 3 % మాత్రమే. వారిలో అధిక శాతం వృద్ధులే ఉన్నారు కాబట్టి కరోనా వైరస్ అంత ప్రాణాంతకమైనది ఏమీ కాదు అన్నది ముందు నుంచి అందరూ మొత్తుకుంటున్న మాటే. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని దేశాల శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైరస్ మనిషిలో చూపించే ప్రభావం మరి ఇతర జంతువులు చూపించకపోవడంతో చివరికి లండన్ లోని 'క్వీన్ మేరీ బయో ఎంటర్ప్రైజెస్ ఇన్నోవేషన్ సెంటర్' కు చెందిన నిపుణులు మనుషుల పైన ప్రయోగానికి సిద్ధమయ్యారు.

 

IHG

 

దీని కోసం వారు అత్యంత ఆరోగ్యంగా ఉండే వారిని ఎంపిక చేసి వారికి కరుణ వైరస్ ఎక్కించి చికిత్స చేస్తామంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి 3500 పౌండ్లు అనగా భారత కరెన్సీలో మూడు లక్షలు ఇస్తామని కూడా చెప్పారు. కరోనా వైరస్ జాతికి చెందిన అదే రకమైన OC43, 229E వైరస్‌లను స్వచ్ఛంధంగా వచ్చిన వారికి ఎక్కించనున్నారు. 24 బ్యాచులుగా విభజించి వారికి కరోనా వైరస్ ఎక్కించనున్నారు. రెండు వైరస్ జాతులు.. కరోనా జాతుల్లో ఒకే రకమైనవి.. కానీ, ప్రాణాంతకమైన వైరస్‌‌లు కావు.. స్వల స్థాయిలో శ్వాసకోశ లక్షణాలు ఉంటాయి.

 

IHG

 

ఏది ఏమైనా సైంటిస్టులు మాత్రం.. ప్రయోగం సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడికి పోయిన వారందరిని క్షేమంగా తీసుకొని వస్తామని శాస్త్రవేత్తలు నమ్మకంగా ఉన్నారు. వారి దగ్గర ఉన్న వ్యాక్సిన్ కచ్చితంగా పనిచేస్తుందని ఇప్పుడు ఉన్న సమాచారం. అందుకే అక్కడికి పోయిన వారంతా ఇంత రిస్క్ తీసుకున్నారు. అయితే వారంతా అక్కడ కఠినమైన డైట్ తో పాటు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు.. ఎవరితోనూ ఫిజికల్ కాంటాక్టు పెట్టుకోకూడదు. వీరిపై దశలు వారీగా పరీక్షలు నిర్వహిస్తుంటారు. కరోనా వైరస్ కంట్రోల్ చేసేందుకు ప్రయోగం ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక కరోనాకి మందు దొరికేసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: