టీమిండియాలో క్రికెట్ కి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మామూలుగా క్రికెటర్లకు చాలామంది అభిమానులు ఉంటారు. కేవలం క్రికెటర్ కి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.... స్టార్ క్రికెటర్ లకి  ఎంతో మంది ఇతర దేశాల క్రికెటర్లు కూడా అభిమానులు ఉంటారు. ఒక్కొక్కసారి తమ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని చెప్పి అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటారు దిగ్గజ క్రికెటర్ లు . తాజాగా వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అదే చేశాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం అయిన బ్రియాన్ లారా   ఎన్ని రికార్డులు సృష్టించారో  చెప్పాల్సిన పని లేదు. వెస్టిండీస్ జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టి జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. ఇక బ్రియాన్ లారా తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. 

 

 

 ఇక తాజాగా టీమిండియాలో ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో  తన అభిమాన ఆటగాడు ఎవరో  వెల్లడించారు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా. టీమిండియా యువ ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఆటకు తాను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ మైదానంలో ఆడుతుంటే అతని ఆటను చూడటానికి ఎంతో ఆస్వాదిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు బ్రియాన్ లారా. క్లాస్ క్రికెట్ అనేదానికి రాహుల్ ఆట పర్యాయ పదం అంటూ తెలిపాడు. అసలు సిసలైన బ్యాటింగ్ వినోదాన్ని అందించడం లో రాహుల్ తర్వాతే ఎవరైనా అంటూ ప్రశంసలు కురిపించాడు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా రాహుల్ బ్యాటింగ్ తీరు ఉంటుంది అంటూ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసలు కురిపించారు. 

 

 

 క్రీడా మ్యాగజైన్ స్పోర్ట్స్ స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  బ్రియాన్ లారా ఈ వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో దిగ్గజ ఆటగాడు అయిన విరాట్ కోహ్లీరోహిత్ శర్మ పేరు చెప్పకుండా... కేఎల్ రాహుల్ తన  పేరు చెప్పుకునేలా బ్రియాన్ లారా ను ఆకర్షించడం ప్రస్తుతం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం అతనికి తిరుగులేదు అని నిరూపిస్తున్న విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ ప్రస్తుతం కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్నాడు. ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే ఏ స్థానంలో వచ్చిన సెంచరీలు భాదేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: