ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసి.. ప్రతి ఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేసిన కోరాన చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే ఈ కోరానా అక్కడ వరకు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వేల మంది ప్రాణాలు హరిస్తుంది.  ఇప్పటికే చైనాలో 3 వేల మందికి పైగా మరణించారు.   ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కోరోనా వ్యాప్తి కట్టడి చేయలేక పోతున్నారు.  చైనా తర్వాత ఈ కరోనా ఎఫెక్ట్ ఇరాన్ లో ఉంది.  తాజాగా కరోనా భయంతో వణికి పోతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు చైనా అధ్యక్షులు కంకణం కట్టుకున్నారు.  హుబెయి ప్రావిన్స్, దాని రాజధాని వూహాన్‌లో కరోనాను కట్టడి చేయడం ద్వారా ప్రాథమికంగా విజయం సాధించినట్టు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు.  చైనాలో పుహాన్ లో కరోనా పుట్టుకు వచ్చిన విషయం తెలిసిందే. అదే పుహాన్ లో పర్యటించారు చైనా అధ్యక్షులు.

 

వూహాన్‌కు విమానంలో వచ్చిన జిన్ పింగ్.. ముఖానికి మాస్క్‌తో పలు ప్రాంతాల్లో పర్యటించారు. వూహాన్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఫ్రంట్‌లైన్ మెడికల్ వర్కర్లు, రోగులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. అక్కడి నుంచి హాన్‌లోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు వెళ్లి ప్రజలు, సామాజిక కార్యకర్తలతో మాట్లాడారు. చైనా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని.. కష్టం వచ్చినపుడు ధైర్యంగా ఉండాలని అన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరించకుండా హుబేయి ప్రావిన్స్, వూహాన్‌లో కట్టడి చేసినట్టు చెప్పారు. జనాలు భయపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తలు పాటించాలిని.. తినే ఆహార విషయంలో కూడా  శ్రద్ద తీసుకోవాలని.. అన్నారు. 

 

అయితే చిన్న పిల్లలు విషయంలో మరింత శ్రద్ద చూపించాలని అన్నారు.  కరోనా వ్యాధి వల్ల చనిపోయిన వారికి శ్రద్దాంజలి ఘటించారు. అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో హుబేయి అధికారులు కీలక ప్రకటన చేశారు. వైరస్ ప్రబలిన తర్వాత వూహాన్, సెంట్రల్ హుబేయి ప్రాంతాలను దిగ్బంధించిన అధికారులు రాకపోకలను నిషేధించారు. అయితే, ఇప్పుడీ ఆంక్షలను తొలగించినట్టు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: