కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నటప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ అని మంచి మంచి శీర్షికలని పొందాడు మోహన్ బాబు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి అఖండ ప్రజాదరణ పొందాడు మోహన్ బాబు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు మంచి రోల్ ప్లే చేసాడు. అభిమానుల గుండెల్లో కలెక్షన్ కింగ్గా మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ నటుడు. 

 

IHG

 

గాయత్రీ, ఝుమ్మంది నాదం, వస్తాడు నా రాజు, పంచాక్షరీ, సలీం, రాజు మహారాజు, మేస్త్రి, పాండురంగడు, బుజ్జిగాడు, కృష్ణార్జున, యమదొంగ, రాజుభాయ్, గేమ్, శ్రీ, పొలిటికల్ రౌడీ, సూర్యం, శివ శంకర్, విష్ణు, తప్పు చేసి పప్పు కూడు, కొండవీటి సింహాసనం ఇలా అనేక సినిమాలలో నటించాడు మోహన్ బాబు. మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ నటుడు. నిర్మాతగా కూడా రాణించి మంచి సినిమాలని అందించాడు. ఒకటీ, రెండు కాదు ఏకంగా 72 సినిమాలకి నిర్మాతగా వహించాడు నటుడు మోహన్ బాబు. 

 

కేవలం సినిమాలో మాత్రమే కాకుండా విద్యావేత్తగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. 1992 లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్టుని స్థాపించాడు. ఇందులో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల , నర్సింగ్ కళాశాలలు ఇందులో ఉన్నాయి. 

 

IHG

 

అలానే  మోహన్ బాబు రాజకీయ నాయకుడు కూడా. 1995 వ సంవత్సరం నుండి 2001 వరకు రాజ్య  సభ  సభ్యునిగా మోహన్ బాబు పని చేసాడు. 1982 లో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరాడు. ప్రజలకి మంచి చెయ్యాలన్న ధ్యేయంతో అయన చేరారు. కానీ ఆశలు ఫలించకపోయే సరికి మోహన్ బాబు తిరిగి సినిమాలని చేసుకోవడానికి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలా మోహన్ బాబు రాణించలేక పోయాడు నాయకుడిగా. 

మరింత సమాచారం తెలుసుకోండి: