జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ అనే పదం బాగా పాపులరైపోయింది. ఎలాగంటే ప్రజాధనాన్ని ఆదా చేయటంలో భాగంగా జగన్ ప్రతి శాఖలోను రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నాడు. దాంతో ఇరిగేషన్ శాఖ కావచ్చు ఇతరత్రా శాఖల్లో కొనే ఫర్నీచర్, మొబైల్స్, కంప్యూటర్లు ఇలా... ఏదేనా కానీవండి అన్నింట్లో కూడా ఎంతో కొంత ప్రజాధనం ఆదా అవుతోంది.

 

సరే ఇది జగన్ అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ వ్యవహారం. మరి ఇదే రివర్స్ వ్యవహారాన్ని చంద్రబాబునాయుడు కూడా అమలు చేస్తున్నారు. కాకపోతే ఫార్టి ఇయర్స్ ఇండస్ట్రీ రాజకీయంగా జగన్ పై బురద చల్లటానికి వాడుకుంటున్నాడు. అందుకనే చంద్రబాబులోని అక్కసు ఏమిటో తెలిసిపోతోంది. మొదటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు అడ్డుకున్నాడు.

 

తన మనిషితోనే ప్రభుత్వంపై కోర్టులో కేసు వేయించాడు. దాంతో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ ను హైకోర్టు ప్రభుత్వం కొట్టేసింది. దాంతో బిసిలపై జగన్ కు చిత్తశుద్ది లేదంటూ తన పచ్చమీడియాలో రాయిస్తున్నాడు. అంటే ఇది రివర్స్ యవ్వారమే కదా.  అలాగే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమ పార్టీ నేతలతో నామినేషన్లు వేయించకుండా వైసిపి నేతలు అడ్డుకుంటున్నారంటు  రివర్స్ ఆరోపణలకు దిగారు. ఏమిటయ్యా అంటే  టిడిపి వాళ్ళకు అధికారులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదట. నో డ్యూస్ సర్టిఫికేట్లు ఇవ్వలేదట.

 

విచిత్రమేమిటంటే పోటి చేయదలచుకున్న టిడిపి నేతలు నోటిఫికేషన్ వచ్చేంత వరకూ నామినేషన్ కు అవసరమైన సర్టిఫికేట్లు రెడీ చేసుకోకుండానే ఉంటారా ? అంతా రివర్స్ వ్యవహారం కాకపోతే మరేమిటి ? పోటి చేయటానికి టిడిపికి గట్టి అభ్యర్ధులు దొరకటం లేదన్నది వాస్తవం.  ఒకవైపు సీనియర్లు పోటికి ముందుకు రావటం లేదు. అదే సమయంలో కొందరు సీనియర్లు పార్టీకి రాజీనామాలు చేసి వైసిపిలో చేరిపోయారు. మరి కొందరు వైసిపిలో చేరటానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇటువంటి విషయాలతో టెన్షన్ పెరిగిపోతున్న చంద్రబాబు  ఈ  విషయాలు  బయటపడకుండా వైసిపిపై రివర్స్ దాడి మొదలుపెట్టటమే విచిత్రంగా ఉంటుంది.  

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: