సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా గుండె గుభేల్ అంటుంది. అసలు అది అక్కడ ఉందీ.. సంచరిస్తుందీ అన్న విషయం తెలిస్తేనే చుట్టుపక్కలకు వెళ్లకుండా ఉంటాం. అలాంటిది ఓ భారీ కొండ చిలువ ఏకంగా స్కూల్లో ప్రత్యక్షం కావడంతో పిల్లలు దాన్ని చూసి పరుగో పరుగు.  ఈ మద్య అడవిలో ఉండాల్సిన జీవరాసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోకి రావడం చూస్తున్నాం.  ఆ మద్య ఓ చిరుత పులి స్కూల్లోకి ప్రవేశించి అక్కడ తిరుగుతున్న ఓ కుక్కను నోట కరుచుకుని వెళ్లిపోయింది.  అయితే పులి రాకను గమనించిన అక్కడి విద్యార్థులు స్కూల్ గదుల్లోకి వెళ్లి గడియవేసుకొని ప్రాణాలు కాపాడుకున్నారు.  కొంత కాలంగా అడవి జంతులువు, సర్పాలు ఊళ్లలోకి రావడానికి కారణం అక్కడి అడవులు నరికి వేత.. వాటి ఆహార కొరతనే కారణం అని అంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. 

 

తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ కొండ చిలువ కలకలం రేపింది. దాదాపు 6 మీటర్లు ఉన్న కొండ చిలువను చూసి స్థానికులు, విద్యార్థులు భయపడిపోయారు.  అంత పెద్ద కొండ చిలువ ఎప్పుడూ చూడలేదని భయంతో వణికి పోయారు.. వెంటనే స్కూల్ యాజమాన్యం అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ ప్రొటెక్షన్ టీం వచ్చి ఆ భారీ కొండచిలువను చాకచాక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని మల్లారం అటవీ ప్రాంతంలో వదిలేశారు అటవీ సిబ్బంది. 

 

అయితే అక్కడ మేకలు, కుక్కలు ఇతర చిన్న చిన్న జంతువులు తిరుగుతుండటం వల్ల ఆ కొండ చిలువ ఆహారం కోసం ఇక్కడకు వచ్చి ఉండవొచ్చు అని అటవీ అధికారులు అంటున్నారు. అయితే ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురికావడం సహజం అని.. అయితే అటవీ అధికారులకు వెంటనే సమాచారం తెలియజేస్తే తగు జాగ్రత్తలు సూచించి వెంటనే రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి కృరమృగాలు సంచరిస్తున్నట్లు తెలిసినా వెంటనే సమాచారం అందించాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: