వైసీపీలోకి ఎప్పుడు ఒక్కొక్కరుగా నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతుండడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు చేరికలపై పెద్దగా ఆసక్తి చూపించని జగన్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో తమ రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ తెరతీశారు. దీంతో తమకు పార్టీలో ప్రాధాన్యత లేదని భావిస్తున్న నేతలు, అసంతృప్తి, రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్నవారు, ఇలా అధికార పార్టీ వైసీపీలో చేరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు వలస వచ్చిన నాయకుల వల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా, వారి చేరికలు అనవసర తలనొప్పులు తెస్తాయా అనే విషయంపై లోతుగా చర్చ జరుగుతోంది.

 

IHG


 స్థానిక సంస్థల ఎన్నికల వరకు చూసుకుంటే, వీరి చేరిక వల్ల లాభం చేకూరే అవకాశం ఉన్నా, ఆ తరువాత నియోజకవర్గ స్థాయిలో గ్రూపు తగాదాలు, వర్గ విభేదాలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే వైసిపిలో ఉన్న నాయకుల మధ్య సమన్వయం లేక చాలా చోట్ల గ్రూపు తగాదాలు ఎక్కువ అయ్యాయి. ఈ విషయంలో అధిష్టానానికి తెలిసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలను, వైసీపీలో చేర్చుకోవడం ద్వారా మరికాస్త ఎక్కువగా ఈ తగాదాలు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. 


కానీ జగన్ మాత్రం ఏ విషయాలను పట్టించుకునే విధంగా లేరు. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీలో ఉన్న నాయకులందరిని, వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు కూడా వైసీపీ లోకి వచ్చి చేరేందుకు సిద్ధంగా ఉన్నా, వారి విషయాన్ని ప్రస్తుతానికి జగన్ పక్కనపెట్టి నియోజకవర్గ స్థాయి ,ద్వితీయ స్థాయి నాయకులపైన దృష్టి కేంద్రీకరించారు. అలాగే ప్రజాబలం ఉన్న నాయకులు, ఇతర పార్టీలో ఉన్న వారికి రకరకాల హామీ ఇస్తూ పార్టీలో చేరే విధంగా ప్రయత్నించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే జగన్ ఆదేశాలు జారీ చేశారు. 

 

IHG


దీంతో రెండు రోజులుగా వైసీపీలో చేరికల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇదే అంశాన్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రజల్లో సానుభూతి పొందే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు వైసీపీకి చెందిన  23 మంది శాసనసభ్యులను టిడిపిలో చేర్చుకుని అప్రతిష్ఠ మూట కట్టుకున్నారు. అప్పుడు తాము చేసింది తప్పు అయితే ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి అని టిడిపి ఎదురు దాడి చేసే అవకాశం కూడా లేకపోలేదు అనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయాలన్నీ జగన్ కు తెలియనివి కావు. నాయకులు చేరినా, ఎక్కడా ఆ పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా జగన్ ఏదో ఒక ఫార్ములా ఉపయోగించే అవకాశం ఉందని, అంత ఆషామాషీగా అయితే జగన్ నిర్ణయాలు తీసుకోరని మరికొందరు వైసిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: