ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ అధికార టీడీపీ రాజ‌కీయాలు మంచి ర‌స‌కందాయంలో ప‌డుతున్నాయి. విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ ప‌ద‌వి జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు రిజ‌ర్వ్ చేయ‌డంతో ఈ ప‌ద‌వి కోసం ఎవరికి వారే పోటీ ప‌డుతున్నారు. అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీలోనూ ఈ ప‌ద‌వి మాకే కావాలంటూ కీల‌క నేత‌లు పోటీ ప‌డుతుండ‌డంతో విజ‌య‌వాడ టీడీపీ, వైసీపీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది. ఇక టీడీపీ త‌ర‌పున ముగ్గురు, న‌లుగురు నేత‌లు పోటీలో ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె శ్వేతాను ఎంపిక చేసింద‌ని ఎంపీ నాని వ‌ర్గం ప్ర‌చారం చేసుకుంటోంది. ఆమె గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో తండ్రి తరుపున శ్వేతా ప్రచారం నిర్వహించారు. యూఎస్ లో జరిగిన గత ఎన్నికల్లో ఆమె హిల్లరీ క్లింటన్ తరుపున ప్రచారం నిర్వహించారు.

 

ఇక రాజ‌ధాని మార్పు నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో వైసీపీపై యాంటీ ఉంద‌న్న ప్ర‌చారం ఉంది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠంపై ఖ‌చ్చితంగా త‌మ పార్టీ జెండాయే ఎగురుతుంద‌న్న అంచ‌నాలు టీడీపీలో ఉన్నాయి. దీంతో త‌మ‌కే మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కాల‌ని ఎవ‌రికి వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత పేరు ప్ర‌ముఖంగా తెర‌మీద‌కు తెచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా త‌న స‌తీమ‌ణి సుజాత పేరు ను సైతం తెర‌మీద‌కు తెస్తున్నారట‌.

 

ఇక మాజీ కార్పోరేట‌ర్, దేవినేని ఇంటి కోడ‌లు దేవినేని అప‌ర్ణ సైతం త‌న పేరు ప‌రిశీలించార‌ని కోరుతున్నారు. ఏదేమైనా మేయ‌ర్ ప‌ద‌వి విష‌యంలో కేశినేని నాని వ‌ర్గం మాత్రం కేశినేని కుమార్తె పేరు శ్వేత ప్ర‌క‌టించింద‌ని చెప్పుకుంటుంటే.. బొండా వ‌ర్గం మాత్రం అలాంటి ప్ర‌క‌ట‌న ఏదీ లేద‌ని... తాము సైతం మేయ‌ర్ రేసులో ఉన్నామ‌ని చెపుతోంది. మ‌రి వార్‌లో ఫైన‌ల్‌గా అస‌లు విజ‌య‌వాడ మేయ‌ర్ పీఠంపై టీడీపీ జెండా ఎగురుతుందా ?  మేయ‌ర్ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంది ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: