ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామం హోరెత్తుతోంది. సాధారణ ఎన్నికలు ముగిశాక తొమ్మిది నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త ఏంటో ఈ ఎన్నికలతో చాటిచెప్పాలని విపక్ష పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తొమ్మిది నెలల్లో జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విమర్శలకు చెక్ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సాధారణ ఎన్నికల ఫలితాలే రిపీట్‌ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎక్కడైతే వ్యతిరేకంగా వస్తాయో... వాళ్ళ పదవులకు చెక్‌ పెట్టేస్తాం అని చెప్పడంతో వైసిపి నేతలంతా ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నారు.
 

ఇదిలా ఉంటే ఈ ఎన్నిక‌ల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విజయవాడ కార్పొరేషన్ ఎవరికి దక్కుతుంది అన్నది ఆసక్తిగా మారింది. విజ‌య‌వాడ త‌మ కంచుకోట అని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాగా రాజధాని పరిధిలో ఉన్న ఈ సీటుకోసం అధికార... ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ తరపున మేయర్ అభ్యర్థిగా బొప్పన భవకుమార్ సతీమణిని ఆ పార్టీ ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. భవకుమార్ గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేశారు. విజయవాడలో ఇప్పటికే టీడీపీ వైసీపీలు ప్రచారం ప్రారంభించాయి.


అయితే భ‌వ‌కుమార్‌తో పాటు సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు సైతం త‌న వ‌ర్గానికి ఈ ప‌ద‌వి ఇప్పించుకునే ప్లాన్ వేశారు. ఆయ‌న కార్పొరేట‌ర్‌గా త‌న త‌మ్ముడు స‌తీమ‌ణిని రంగంలోకి దించ‌నున్నార‌ట‌. ఇక ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్న వెల్లంప‌ల్లి శ్రీనివాస్ సైతం త‌న నియోజ‌క వ‌ర్గానికే మేయ‌ర్ ప‌ద‌వి ద‌క్కేలా ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఈ మూడు ముక్క‌లాట‌లో మేయ‌ర్ పీఠం వైసీపీ ద‌క్కించుకుంటుందా ?  ఏ వ‌ర్గం పై చేయి సాధిస్తుంది అన్న‌ది చూడాలి.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: