దేశం మొత్తం అల్లకల్లోలంలా మారిపోయింది.. భూకంపం, భూ ప్రళయం, తుఫాను, భూప్రకంపనల వల్ల కూడా కాదండోయ్.. ఆ మాయదారి కరోనా వైరస్ వల్ల.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ వల్ల ప్రజలు అందరు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.. చైనా ని వణికించింది. తర్వాత ఇటలీ, అమెరికా ఒక్కటేంటి అన్ని దేశాల్ని గడగడలాడిస్తుంది.. ఇప్పుడు ఏకంగా మన భారత దేశంలోకి కూడా వచ్చేసింది..ఎవరితోనన్న మాట్లాడాలన్నా భయమే, కరచాలనం చేయాలన్న భయమే, తుమ్మాలన్న, దగ్గాలన్న,ఏదన్నా తినాలన్న, ఆఖరికి ఊపిరి పీలవాలన్న బయపడి చేస్తున్నారు..

 

మన దేశంలోని కేరళలో కూడా   కోవిడ్‌-19 (కరోనా వైరస్‌)  విజృంభిస్తున్న తీరుని చూస్తుంటే  ఆందోళన  కలుగుతుంది.. ఇప్పటికే కర్ణాటకలో ఒక వ్యక్తి చనిపోయినట్టుగా  భావిస్తున్నారు. ఈ తరుణంలో  కేరళలో 85 ఏళ్ల మహిళ ఆరోగ్య పరిస్థితి అంతకంతకు  క్షీణిస్తుందట.ఆ వృద్ధురాలిని  ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి  కోవిడ్ -19కు చికిత్స చేస్తున్నారు.  చికిత్స పొందుతున్న  మహిళ ఆరోగ్య పరిస్థితి  విషమంగా ఉందని ఆరోగ్య అధికారులు బుధవారం వెల్లడించారు.

 

గుండె జబ్బు వంటి  ఇతర దీర్ఘకాలిక వ్యాధుల దృష్ట్యా పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు. కానీ  ఆమె 96 ఏళ్ల భర్త ఆరోగ్య పరిస్థితి  మాత్రం స్థిరంగా ఉందని తెలిపారు. వీళ్ళ కొడుకు  ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి ఇండియా కి తిరిగి వచ్చాడు. అయితే ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి  కరోనా వైరస్ బాధితుడు. ఆ  వ్యక్తి (24) తల్లిదండ్రులే ఈ  దంపతులు . ఇదిలా వుండగా, ప్రారంభ దశలో జ్వరం బారిన పడిన వీరు  ఇద్దరు  ఒక డాక్టర్ దగ్గర చికిత్స తీసుకున్నారు.. తర్వాత  కరోనావైరస్  సోకిన కారణం చేత ఐసొలేషన్ గదిలో ఉంచి చికిత్స చేస్తున్నారు.. వీరు  ముందు  సంప్రదించిన తిరువత్తుకల్‌లో క్లినిక్ నడుపుతున్న వైద్యుడిని  కూడా పరిశీలనలో ఉంచారు.

 

 

మరోవైపు  వ్యాధి లక్షణాలను దాచిపెట్టిన గాని,  వ్యాధివిస్తరణకు దారి తీసే చర్యలకు దేనికైనా మద్దతివ్వడం   ప్రజారోగ్య చట్టం ప్రకారం నేరమని కేరళ ఆరోగ్య మంత్రి కే కే శైలజ  ప్రకటించారు. అలాగే   ప్రభావిత ప్రాంతాలు,లేదా  దేశాల నుండి తిరిగి వచ్చిన వారి ప్రయాణ వివరాలను గోప్యంగా ఉంచిన అంశాన్ని కూడా నేరంగా పరిగణిస్తామని తెలిపారు.విదేశాలనుంచి ఎవరు భారత దేశానికీ వచ్చిన తెలియచేయాలన్నారు.. దగ్గు, జలుబు జ్వరం లక్షణాలు ఉంటే హాస్పిటల్ లో సంప్రదించాలని తెలిపారు. వ్యాధి వచ్చాక బాధపడేకంటే, రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కదా !

మరింత సమాచారం తెలుసుకోండి: