మధ్యప్రదేశ్ ప్రభుత్వం లో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జ్యోతిరాదిత్య సింధియా... కాంగ్రెస్ పార్టీకి స్వస్తి పలకడం లో సంచలనంగా మారింది. దీంతో అప్పటివరకు అంతా బాగానే ఉన్న  మధ్యప్రదేశ్ ప్రభుత్వం లో ప్రతిష్టంభన ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన ఆరుగురు  మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం తో ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో  కమల్నాథ్ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ తో భేటీ అయిన జ్యోతిరాదిత్య సింధియా ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. 

 

 

 అయితే కాంగ్రెస్ పార్టీలో గత 18 ఏళ్లుగా జ్యోతిరాదిత్య సింధియా కీలక నేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఎన్నికల విజయం  సమయంలో ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింధియా అప్పటి నుంచి కాంగ్రెస్ అధిష్టానంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఇక దీనినే క్యాష్ చేసుకుని  బిజెపి జ్యోతిరాదిత్య సింధియాను బీజేపీలోకి ఆహ్వానించింది. తాజాగా జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా బీజేపీలో చేరారు. బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన జేపీ నడ్డా జ్యోతిరాదిత్య సింధియాకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కమల్నాథ్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 అయితే ప్రస్తుతం జ్యోతిరాదిత్య సింధియా వెంట ఉన్న ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లుగా అటు స్పీకర్ కూడా ప్రకటించారు. కానీ సదరు మంత్రులు సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ను డిమాండ్ చేస్తోంది. అయితే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారు అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం ప్రస్తుతం సంక్షోభంలో పడినప్పటికీ... అసెంబ్లీ లో నిర్వహించే బలపరీక్షలో నెగ్గగలము  మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి కమల్నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడిన జ్యోతిరాదిత్య సింధియా వెంట ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శిబిరానికి  వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ముఖ్య మంత్రి కమల్ నాథ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: