ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా ఎఫెక్ట్ తో ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుంది.  వాణిజ్య సంస్థలు కరోనా ఎఫెక్ట్ తో నష్టపోతున్నాయి.  చైనాలో వ్యాపించిన ఈ కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకిపోయింది.  ఎక్కడ చూసినా కరోనా భయంతో వణికి పోతున్నారు.  ఈ నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు చికెన్ పై పడింది.  కొన్ని రోజుల నుంచి కరోనా దెబ్బకు చికెన్ వ్యాపారం కుదేలైంది. దీంతో వ్యాపారులు చికెన్ ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు.  ఎంతగా అంటే ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో రూ. 100 కే మూడు కిలోలు అంటున్నారు. 

 

మరికొన్ని చోట్లు రూ.25 నుంచి 30 వరకు అమ్ముతున్నారు.  ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకే చికెన్ ను అమ్ముతున్నారు. చిత్తూరు జిల్లా కలికిరిలో చికెన్ వ్యాపారస్తులు రూ.100కే మూడు కిలోల చికెన్ ను అమ్ముతున్నారు.  ఇంకేముంది  చికెన్ ప్రియులు షాపుల వద్ద క్యూ కడుతున్నారు. వాస్తవానికి చికెన్ తింటే ఏమీ కాదని దాని వల్ల ప్రాణ హాని ఉండదని.. చికెన్ బాగా ఉడికించి తినడం వల్ల వైరస్ అనేది ఏదీ రాదని అంటున్నారు.  ఈ విషయం కోళ్ల పరిశ్రమలు నిర్వహించేవారికి చెబుతున్నా.. కరోనా ఎఫెక్ట్ చికెన్ పై కూడా ఉంటుందని.. అందుకే చికెన్ కి దూరంగా ఉండాలని చెప్పడంతో జనాలు చికెన్ జోలికి వెళ్లకుండా ఉంటున్నారు. 

 

హైదరాబాద్ లో కూడా కిలో చికెన్ ధర రూ.100కి పడిపోయింది.  అయితే చికెన్ ధరలు తగ్గించడం వల్ల కొన్ని చోట్ల గిరాకీ బాగానే అవుతుందని.. జనాలు క్యూ కట్టి మరీ చికెన్ కొనుక్కొని వెళ్తున్నారని షాపు యజమానులు అంటున్నారు. నెల రోజుల క్రితం చికెన్ ధర రూ.180 నుంచి రూ.200గా ఉంది. కరోనా ఎఫెక్ట్ తో ఒక్కసారిగా చికెన్ వాడకం తగ్గిపోవడంతో వ్యాపారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: