కొందరు రాజకీయాలలోకి ఇష్టంతో వస్తారు.. మరికొందరు రాజకీయా పవర్ కావాలని వస్తారు.. మరికొందరు ప్రజలకు మంచి చెయ్యాలని వస్తారు.. ఇంకొందరు రాజకీయం చేసి ఆస్తులు పెంచుకోవాలని వస్తారు.. కొందరు మాత్రం రాజకీయాలలోకి తప్పని పరిస్థితిల్లో వస్తారు.. అలా వచ్చి అవమానాలు ఎదురుకున్నందుకు కోపంతో రాజకీయాలలో రాణులు అవుతారు. 

 

అలా రాణి అయ్యింది ఎవరో కాదు జయలలిత.. ఆమె రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎంజీఆర్. ఆమె అసలు సినిమాలే చెయ్యకూడదు అనుకుంది.. కానీ ఆమె తల్లి వల్ల ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా చదువును మానేసి సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లో కూడా ఒక్క సినిమా చేసి బయట పడుదాం అనుకున్న ఆమెను ఎంజీఆర్ అపి వరుసగా సినిమాల్లో నటించేలా చేశాడు.. 

 

ఆమె చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలను కానీ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న ఆమెను పెళ్లి చేసుకోకుండా కొందరు దుష్టులు ఆపారు.. దీంతో ఆమె జీవితం ఒక పెళ్లి కానీ స్త్రీ లా అయిపోయింది. అంత అయిపోయింది అనుకున్న సమయంలో మళ్లీ ఎంజీఆర్ వచ్చి రాజకీయ ప్రచారం చెయ్యాలి అని పిలుపునిచ్చాడు. 

 

ఆమె ప్రజలలోకి వెళ్తే ఆమెకు ఎంతో ఆదరణ.. నిత్యం ప్రజల మధ్య తిరిగే రాజీకీయనాయకుడికి కూడా అంత ఆదరణ లేదు.. దీంతో ఎంజీఆర్ ఆమెకు రాజకీయాలలో మంచి పవర్ ఇచ్చాడు.. అయితే అలా పవర్ ఇవ్వడం ఎంజీఆర్ పక్కన ఉన్నవారికి ఇవ్వలేదు.. దీంతో ఒక ఆడదానికి పవర్ ఇవ్వడం ఏంటి అని అందరూ ఫైర్ అయ్యారు. 

 

చివరికి ఒకానొక రోజు ఎంజీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షిణించింది. దీంతో అయన మరణించాడు. ఆరోజే ఎంజీఆర్ ను చూడటానికి అని ఆమె వెళ్తే ఆమెను చాలా దారుణంగా అవమానించారు.. ఇంకా ఆ అవమానమే ఆమెను రాణిని చేసింది. ఆమె ఒక శక్తిగా ఎదిగి ప్రజలకు అమ్మ అయ్యింది. ప్రజల కష్టాలు తీర్చి వారికీ రాణి అయ్యి తమిళనాడు రాజ్యాన్ని ఏలింది. అలా ఎంజీఆర్ మరణమే ఆమె రాజకీయ జీవితానికి పునాథి అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: