ఊహించిందే నిజ‌మైంది. తెలంగాణ‌లో బీజేపీని దూకుడుగా ముందుకు తీసుకుపోయేందుకు బీజేపీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అధ్యక్షుడి ఎంపిక విష‌యంలో అనేక‌మంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ...యూత్‌లో ఫాలోయింగ్ ఉన్న కరీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌కి పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. త‌ద్వారా ఉత్త‌ర‌తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స‌మ‌న్వ‌యం చేయ‌డం, సంఘ్ మ‌ద్ద‌తు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. కాగా, బీజేపీ పెద్ద‌లు పెద్ద ఎత్తున అంచ‌నాలు పెట్టుకున్న బండి సంజ‌య్ వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఇవి.

 


బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత ప్రొఫైల్ ఇది

పేరు: బండి సంజయ్ కుమార్

పుట్టిన తేదీ:11-7-1971

తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) - శకుంతల.

మతము: హిందువు

కులము: మున్నూరుకాపు,(బి.సి-'డి')

భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)

పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్

ప్రస్తుత బాధ్యత: కరీంనగర్ ఎంపీ 

గతంలో చేపట్టిన బాధ్యతలు:

--బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడు..

--అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్,పట్టణ ఉపాధ్యక్షునిగా,రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..

--ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999;1999-2003) డైరెక్టర్ గా..

--బిజెపి జాతీయ కార్యాలయం,ఢిల్లీ లో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గా

--భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ అధ్యక్షునిగా,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,రాష్ట్ర ఉపాధ్యక్షునిగా,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా,జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి గా బాధ్యతలు చేపట్టారు.

--ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జి గా..

--కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా,రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీ తో హ్యాట్రిక్ విజయం సాధించారు.

-- వరుసగా రెండు పర్యాయాలు నగర బిజెపి అధ్యక్షునిగా.

--2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి,52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిల్చున్నాడు.

--2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ  అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా,రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిల్చున్నారు.

-2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: