బెజవాడ రాజకీయాలు ప్రస్తుతం వంగవీటి రంగా రోజులను తలపిస్తోంది అని అంటున్నారు చాలామంది. మేటర్ లోకి వెళితే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ తరఫున మేయర్ అబ్దుల్ ఎవరు పెద్దగా ప్రచారంలోకి రావటం లేదు, కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం తామంటే తాము అంటూ ముగ్గురు నలుగురు మరి పోటీ పడుతున్నారు. ఓసీ మహిళలకు రిజర్వు కావడంతో బలమైన వర్గం నుంచి మహిళలు పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆచరించి చూపిస్తున్నారు. కాగా గతంలో 2013వ సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ ఈ ప్రాంతం నుండి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈమె విజయవాడ నగరపాలక సంస్థ ఓటు హక్కు నమోదు చేసుకోవడం జరిగింది.

 

ఇదే తరుణంలో అనురాధ భర్త గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. ఆయన నియోజకవర్గంలో ఏదో వార్డు నుంచి అనురాధ పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో గద్దె అనురాధ నీ ఓసీ మహిళా కేటగిరీలో మేయర్ అభ్యర్థిత్వం కోసం పరిగణలోకి తీసుకునే ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఇదే తరుణంలో దేవినేని కుటుంబం నుంచి కూడా దేవినేని అపర్ణ అనే పేరు వినబడుతోంది. మరోపక్క బోండా ఉమా కూడా తన భార్యను కార్పోరేటర్ గా నిలబెట్టి గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

అయితే వీరందరి కంటే ముందుగా ఎంపీ కేశినేని నాని తన కుమార్తె శ్వేతా ను రంగంలోకి దింపి చాలా చురుగ్గా రాజకీయ అడుగులు వెనకనుండి వేపిస్తున్నారు. ఈ తరుణంలో ఎవరికి వారు మంచి బలమైన రాజకీయ పలుకుబడి కుటుంబం కలిగిన నాయకులు కావటంతో గొడవలు జరిగే ఛాన్సుంది అనే టాక్ నడుస్తుంది. ఇదే తరుణంలో బోండా ఉమా మరోపక్క మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులతో గొడవ పడినట్లు వీడియోలు బయటకు రావడంతో ప్రస్తుతం బెజవాడ మరియు పల్నాడు ప్రాంతం మొత్తం రంగా రోజుల రాజకీయాన్ని తలపిస్తుందని చాలామంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: