అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది. రాజకీయంగా జిల్లాలో ఒకప్పుడు జిల్లాలో ఈ నియోజకవర్గం కీలక పాత్ర పోషించింది. ఈ జిల్లా నుంచి గెలిచిన పార్టీ కచ్చితం అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధి యామిని బాల పోటీ చేసి విజయం సాధించారు. గతంలో శైలజానాథ్ కూడా ఇక్కడి నుంచి పోటి చేసి విజయం సాధించారు. గత ఏడాది ఇక్కడి నుంచి పోటి చేసిన జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. 

 

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి టీడీపీ యువ నాయకురాలు బండారు శ్రావణీ శ్రీ ప్రధాన బలం కానున్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఆమె ఓటమి పాలైనా సరే ప్రజల్లోనే ఉన్నారు. యువ నాయకురాలు కావడంతో జేసి వర్గం కూడా ఆమెకు అండగా నిలిచింది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జేసి వర్గం గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అప్పుడు ఎంపీగా ఉన్న జేసి దివాకర్ రెడ్డి నియోజకవర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. 

 

ఇక ఇక్కడ శ్రావణీ బలమైన నేతగా ఉన్నారు. ఆమెకు గ్రామాల్లో మంచి పట్టు ఉంది. అది పంచాయితి ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కార్యకర్తలతో కూడా శ్రావణి కి మంచి పరిచయాలు ఉన్నాయి. ఎక్కువగా కార్యక్రమాలకు వెళ్ళడం ఎవరికి అయినా ఆర్ధిక సహాయం కావాలి అంటే చేయడ౦, నియోజకవర్గ సమస్యల మీద వేగంగా స్పందించడం వంటివి చేస్తున్నారు శ్రావణి. దీనితో చంద్రబాబు కూడా ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఆమె తాత బండారు నారాయణ మూర్తికి ఇక్కడ మంచి పట్టు ఉండేది. ఆయన పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో ఆమె ప్రధాన బలం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: