మాజీ మంత్రి, కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ పార్టీ కండువా కప్పి రామసుబ్బారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. గత రెండు రోజుల నుండి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. వైసీపీ సీనియర్ నేతతో చర్చలు జరిపిన రామసుబ్బారెడ్డి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీలో చేరారు. 
 
రామసుబ్బారెడ్డితో పాటు అతని ముఖ్య అనుచరులు, వర్గీయులు వైసీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే కొనసాగుతోంది. 1995, 1999 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో జమ్మలమడుగులో వైసీపీ తరపున ఆదినారాయణరెడ్డి గెలిచారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరగా రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్తారని గతంలో ప్రచారం జరిగింది. 
 
అయితే రామసుబ్బారెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగారు. గతంలో రామసుబ్బారెడ్డి శాసన మండలి విప్ గా, ఎమ్మెల్సీగా, పార్టీ ఉపాధ్యక్షుడుగా, అటవీ శాఖా మాత్యులుగా పని చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం రామసుబ్బారెడ్డి టీడీపీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ మారే ఆలోచనతోనే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడంటూ ప్రచారం జరిగింది. 
 
కోన్ని రోజుల క్రితం రామసుబ్బారెడ్డి పీఆర్ పార్టీ మారే ఆలోచన ఉంటే ముందుగానే తెలుపుతామని ప్రకటన చేశారు.  పీఆర్ ప్రకటన చేసిన రెండు రోజులకే వైసీపీ నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈరోజు జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాజకీయ విశ్లేషకులు ఒకప్పుడు జమ్మలమడుగు టీడీపీకి కంచుకోటలా ఉండేదని నేడు టీడీపీ పూర్తి గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.                                

మరింత సమాచారం తెలుసుకోండి: