దేశంలోనే సంచలనం సృష్టించిన ఎస్ బ్యాంకు కుంభకోణం ప్రధాన నిందితుడు రాణా కపూర్ సూపర్ స్కెచ్ వేశాడు. ఎప్పుడైతే కుంభకోణం బయటపడిందో  వెంటనే దేశం విడిచి పారిపోయేందుకు కపూర్ ఫ్యామిలి పెద్ద ప్లానే వేసింది. కాకపోతే చివరి నిముషంలో అంతా ఫెయిలైపోవటంతో చివరకు కటకటాలు పాలయ్యారు. రాణాకపూర్ కుటుంబం దెబ్బకు ఎస్ బ్యాంకు దివాలా అంచుల్లోకి కూరుకుపోయింది. అందుకనే ఫ్యామిలిలోని మొత్తం ఐదుగురిపైనా సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్ధలు కేసులు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కుంభకోణం బయటపడగానే సొంత ఆస్తులను అమ్మేసుకుని విదేశాలకు పారిపోవాలని పెద్ద ప్లానే వేశారు. ఇందులో భాగంగానే  ఢిల్లీలో తమకున్న సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే భవనాలను, ఆస్తులను అమ్మేసేందుకు రెడీ అయ్యారు. మంచి ధరకు అమ్ముకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రాపర్టీ బ్రోకర్లను కూడా ఆశ్రయించారు. కొందరు బ్రోకర్లైతే ఆస్తులను కొనే పార్టీలను కూడా తీసుకొచ్చారు. ఆస్తుల అమ్మకంపై  చర్చలు జరుగుతున్నాయి.

 

ఢిల్లీ, ముంబాయ్ లాంటి నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో ప్రజల డబ్బుతోనే కపూర్ ఫ్యామిలి పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వీళ్ళు అనుభవిస్తున్న సమస్త సౌక్యాలు, సౌకర్యాలంతా ప్రజాధనంతో అనుభవిస్తున్నవే. కపూర్ ఫ్యామిలి నిర్వాకంతో బ్యాంకు వాటాదారులు సేఫ్ అయిపోయి చివరకు ఏపాపం తెలీని మామూలు జనాలే రోడ్డున పడిపోయారు.

 

దేశంలో ఎక్కడెక్కడో కొనుగోలు చేసిన ఆస్తులన్నింటినీ ఒకేసారి అమ్మేసి అమెరికా లేకపోతే ఫ్రాన్స్ దేశాల్లోని మారుమూల ప్రాంతాలకు చెక్కేసేందుకు పెద్ద ప్లానే వేసింది కుటుంబం. కాకపోతే వీళ్ళ ప్లాన్ ఎక్కడ ఫెయిలైందంటే కుంభకోణం వీళ్ళు అనుకున్న దానికన్నా ముందే బయటపడింది. అలాగే దర్యాప్తు సంస్ధలు కూడా వీళ్ళు ఊహించిన దానికన్నా వేగంగా స్పందించాయి. అందుకనే విదేశాలకు వెళ్ళిపోతున్న కూతురు రాధా కపూర్ ను ఢిల్లీ విమానాశ్రయంలో ఈడి అధికారులు అదుపులోకి తీసుకుంది. మొత్తం మీద కపూర్ ఫ్యామిలి మామూలోళ్ళు కాదనే విషయం తెలిసిపోయింది. చూద్దాం చివరకు ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: