జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ముందు చంద్రబాబునాయుడు తట్టుకోలేకపోతున్నారా ? పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. మామూలుగా ప్రత్యర్ధులపై మైండ్ గేమ్ ప్లే చేయటంలో చంద్రబాబు మహా ముదురు. కాకపోతే ఇపుడు ఆయన ప్లాన్లన్నీ అవుడేటెడ్ అయిపోవటంతో పాటు పచ్చ మీడియా బండారం కూడా బయటపడిపోయింది. అందువల్లే చంద్రబాబు ప్లాన్లేవీ పనిచేయటం లేదు. దాంతో పచ్చమీడియా ఎంత ప్రయత్నించినా జనాలు చంద్రబాబును నమ్మటం లేదు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు కొందరు టిడిపి నేతలు వైసిపిలోకి చేరిన విషయం గుర్తుంది కదా ? అలా వైసిపిలో చేరిన నేతలతోనే చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు చేయించాడు జగన్. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబుపై ఆరోపణలు కూడా పెరిగిపోయాయి. చంద్రబాబును కట్టడి చేయటానికి జగన్ ప్లే చేసిన అనేక వ్యూహాల్లో వలసలు కూడా ఒకటి. సీన్ కట్ చేస్తే ఇపుడు కూడా అలాంటి వ్యూహమే అమలు చేస్తున్నాడు జగన్.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా చంద్రబాబును కోలుకోలేకుండా దెబ్బ కొట్టాలన్నది జగన్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. అసలే మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుండి కోలుకోలేదు. దానికితోడు వెంటనే స్ధానిక సంస్ధల ఎన్నికలంటే ద్వితీయ శ్రేణి నేతలెవరూ ముందుకు రావటం లేదు. స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసినా ఎవరూ స్పందించటం లేదు. గట్టి అభ్యర్ధులే దొరకక చంద్రబాబు నానా అవస్తలు పడుతుంటే టిడిపి నుండి హఠాత్తుగా వలసలు ఊపందుకున్నాయి.

 

గడచిన రెండు రోజుల్లో ఏడుగురు మాజీ ఎంఎల్ఏలు, మాజీ మంత్రులు టిడిపికి రాజీనామాలు చేసి వైసిపిలో చేరారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, రహమన్, సతీష్ రెడ్డి, కదిరి బాబురావు, రామసుబ్బారెడ్డి లాంటి సీనియర్లు చేరటంతో  చంద్రబాబుకు షాక్ తగిలింది. ఈ వలసలు మరింతటా ఊపందుకనే అవకాశాలు కనిపిస్తున్నాయి. టిడిపిని ఏ దశలో కూడా కోలుకోనీయకుండా  చేయాలన్న జగన్ వ్యూహంలో భాగంగానే ఇదంతా నడుస్తోందని అర్ధమైపోతోంది. ఏదేమైనా జగన్ మైండ్ గేమ్ ను చంద్రబాబు తట్టుకోలేకపోతున్న విషయం తెలిసిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: