అయితే అసలు విషయాన్ని దాచిపెట్టి, వికలాంగుడిని బోండా, బుద్దా ప్రయాణిస్తున్న కారు గుద్దిన విషయాన్ని కప్పిపెట్టి జరిగిన గొడవను మాత్రమే చంద్రబాబు బాగా హైలైట్ చేశారు. దాంతో విషయం క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు  చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది.  కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో దశాబ్దాల పాటు శతృత్వం ఉన్న మాజీ మంత్రి పొన్నపురెడ్డి  రామసుబ్బారెడ్డి ని వైసిపిలో చేర్చుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి కూడా ఈనెల 13వ తేదీన వైసిపి కండువా కప్పుకోబోతున్నాడు. నిజానికి ఇద్దరూ వైఎస్ కుటుంబంతో తీవ్రమైన శతృత్వమున్నవారే.

 

జగన్ తాత వైఎస్ రాజారెడ్డి మర్డర్ కేసులో సతీష్ ప్రధాన సూత్రదారిగా ప్రచారంలో ఉంది. హత్య కేసులో సతీష్ కు జైలుశిక్ష కూడా పడింది.  అయినా ఇపుడు అదే సతీష్ ను జగన్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడంటే అచ్చంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజకీయాన్నే గుర్తు చేస్తోంది. వైఎస్ కూడా సిఎం కాగానే జిల్లాలో తనతో శతృత్వమున్న వాళ్ళందరితో ఓ సమావేశం పెట్టుకున్నారు. శతృత్వాన్ని వదిలేసి మిత్రులమైపోదామని ప్రతిపాదించారు.

 

వైఎస్ ప్రతిపాదనతో వైరి పక్షాల్లోని నేతలు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో జిల్లాలో వైఎస్ కు శతృవులు అనే వారే లేకుండా పోయారు. కాకపోతే రాజకీయంగా విభేదించే టిడిపి నేతలు మాత్రమే మిగిలారు.  ఇపుడు పొన్నపురెడ్డిని చేర్చుకోవటం, 13వ తేదీన సతీష్ ను కూడా పార్టీలో చేర్చుకోవటం జగన్ రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాలి.  జగన్ రాజకీయ కోణంలో మరో కోణమేమిటంటే తెలుగుదేశంపార్టీలో గట్టి నేతలే లేకుండా పోతారు చివరకు.

 

జగన్ పెట్టుకున్న ముహూర్తం కూడా చంద్రబాబునాయుడును గట్టి దెబ్బ తీసేదనటంలో సందేహం లేదు. స్ధానిక ఎన్నికల వేడి బాగా రాజుకుంటున్న నేపధ్యంలో ముఖ్యంగా పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు ఆఖరు తేది. అదే సమయంలో మున్సిపల్, కొర్పొరేషన్ల నామినేషన్లకు తెరలేచింది. అంటే ఇటు పరిషత్ అటు పురపాలక ఎన్నికలకు ఈ రెండు మూడు రోజులు రెండు పార్టీలకు కూడా చాలా కీలకమైన రోజులన్న విషయం తెలిసిందే. సరిగ్గా గురిచూసి కొట్టినట్లు టిడిపికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు వైసిపి కండువాలు కప్పుతుండంటతో  చంద్రబాబుకు పిచ్చెక్కినట్లయిపోతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: