మొన్నటి ఎన్నికల్లో బై బై బాబు అనే నినాదం జనాలకు ఎంతగా కిక్కెక్కించిందో అందరూ చూసిందే.  ఎన్నికల ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఎక్కడ రోడ్డుషో లో పాల్గొన్నా బై బై బాబు అంటూ జనాలతో పదే పదే చెప్పించారు. సరే కారణం ఏదైనా జనాలు నిజంగానే చంద్రబాబు అధికారానికి  బై బై చెప్పేశారు. చెప్పటం కూడా మామూలుగా చెప్పలేదు. ఘోరంగా 23 సీట్లకు మాత్రమే పరిమితం చేసేశారు. టిడిపి చరిత్రలోనే ఇంతటి ఘోర పరాజయం ఎప్పుడూ ఎదురుకాలేదు.

 

సరే అప్పుడు చంద్రబాబుకు జనాలు బై బై చెప్పేస్తే తాజాగా సీనియర్ నేతలు కూడా బై బై చెప్పేస్తున్నట్లే ఉన్నారు. గడచిన మూడు రోజుల్లో  సుమారు ఎనిమిది మంది మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు తెలుగుదేశంపార్టీకి రాజీనామాలు చేసి వైసిపిలో చేరిపోయారు. మరో ఇద్దరు కీలక నేతలు కూడా వైసిపి కండువా కప్పుకోవటానికి 13వ తేదీని ముహూర్తం కూడా నిర్ణయించేసుకున్నట్లు స్వయంగా వాళ్ళే ప్రకటించారు. దాంతో స్ధానిక సంస్ధల ఎన్నికలు మంచి రంజుగా నడుస్తున్నాయి.

 

పార్టీకి రాజీనామాలు చేసి వైసిపిలో చేరిన టిడిపి ప్రముఖుల్లో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ ఎంఎల్ఏలు కదిరి బాబురావు, ఎస్ ఏ రెహమన్, తైనాల విజయకుమార్ ఉన్నారు. మాజీ ఎంఎల్సీ సతీష్ రెడ్డి 13వ తేదీన వైసిపిలో చేరబోతున్నారు. అలాగే మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ కూడా టిడిపికి రాజీనామా చేసేశారు. వైసిపిలో చేరే తేదీని ఇంకా ప్రకటించలేదు. వీళ్ళతో పాటు మరో మాజీ మంత్రి జనసేన నేత పసుపులేటి బాలరాజు, చింతలపూడి వెంకట్రామయ్య కూడా వైసిపిలో చేరారు.

 

టిడిపిని వదిలేసిన నేతలంతా చంద్రబాబుకు బై బై చెప్పే చేరుతున్నారు. సరే పార్టీకి రాజీనామా చేసిన నేతల్లో ఒక్కక్కోళ్ళది ఒక్కో కారణం లేండి. కాకపోతే ఫైలన్ రిజల్ట్ ఏమిటంటే చంద్రబాబుకు బై బై చెప్పేయటమే. మరో వారం రోజుల్లో ఇంకా కొందరు కీలక నేతలు చంద్రబాబుకు బై బై చెప్పేయబోతున్నట్లు సమాచారం. చూద్దాం ఎవరెవరు వచ్చేస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: