తెలుగుదేశం పార్టీ ని  ఇప్పటివరకు మాజీమంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే వీడుతూ వస్తున్నారు . ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తరుపున గెల్చిన  వల్లభనేని వంశీ , మద్దాలి గిరి లు పార్టీకి దూరంగా ఉంటూ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తో టచ్ లో ఉంటున్నారు  . అయితే  టీడీపీ కి చీరాల ఎమ్మెల్యే కరుణం బలరాం మాత్రం పార్టీ వీడేందుకు  తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది . ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి , ఆయన  రెండు మూడు రోజుల వ్యవధిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . గతంలోనూ కరుణం బలరాం పార్టీ వీడడం ఖాయమన్న ప్రచారం జరిగింది .

 

అయితే ఆయన ఆ ప్రచారాన్ని ఖండించారు . తాను టీడీపీ వీడేది లేదంటూ స్పష్టం చేశారు . రాజకీయాలు వేరు , వ్యక్తిగత పరిచయాలు వేరు అంటూ   బీజేపీ లో చేరిన పూర్వపు టీడీపీ  సహచరుడు సుజనా చౌదరి ని కలవడంపై వివరణ ఇచ్చుకున్నారు . ఇక కుమారుడి తో కలిసి  మంత్రి బాలినేని జన్మదిన వేడుకల్లో కరుణం పాల్గొనడం అప్పట్లో హాట్ టాఫిక్ గా మారింది . అయితే అదంతా తనకు బాలినేని తో ఉన్న వ్యక్తిగత పరిచయమే కారణమని చెప్పుకొచ్చారు .  అయితే  కరుణం బలరాం మాత్రం ... టీడీపీ  నాయకత్వ నిర్ణయాలపై కొంత అసంతృప్తి తో ఉన్న మాట నిజమేనని ఆ పార్టీ  వర్గాలు అంగీకరిస్తున్నాయి .

 

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెల్చిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను  పార్టీ అధికారం లో ఉన్నప్పుడు  చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు . అయినా చంద్రబాబు మాత్రం పార్టీ బలోపేతానికి సహకరించాలని కరుణం కు నచ్చచెప్పే ప్రయత్నాన్ని చేశారు . పార్టీ లో గొట్టిపాటి చేరిన తరువాత అద్దంకి పై ఆధిపత్యం కోసం అటు రవికుమార్ , ఇటు బలరాం ల మధ్య  వర్గపోరుకు  తెర లేచింది .     

మరింత సమాచారం తెలుసుకోండి: