ఒకప్పుడు చదువు అంటే చదువుకునే వారు.. కానీ ఇప్పుడు చదువు కొనే పరిస్థితి ఏర్పడింది.  అప్పట్లో బతకడం కోసం బడిపంతులు అనేవారు.. కానీ ఇప్పుడు బతుకు నేర్చిన బడిపంతులు అనే పరిస్థితి నెలకొంది.  ఎందుకంటే కొంత మంది టీచర్లు ప్రేవేట్ స్కూల్ ట్యూషన్ పేరుతో కొత్త కొత్త దందాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.  అయితే సొసైటీలో ప్రైవేట్ స్కూల్ లో చేర్పించడం ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతున్నారు.  ఈ నేపథ్యంలో ఫీజుల గురించి ఏమీ ఆలోచించకుండా డబ్బు ఎంతైనా ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు నానా అగచాట్లు పడుతున్నారు. 

 

ప్రైవేటు స్కూళ్లలో ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తే ఎలాగని తెలంగాణ హైకోర్టు మండిపడింది. ఇష్టానుసారం ఫీజులు పెంచుతున్న స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులకు సంబంధించి వేసిన కమిటీ రిపోర్టును ఏం చేశారని ప్రశ్నించింది.   తెలంగాణలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూళ్ల జాబితాను తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫీజుల నియంత్రణపై తిరుపతి రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియజేయాలని ఆదేశించింది. 

 

 స్కూలు ఫీజుల నియంత్రణ కోసం తాము ఆదేశాలు ఇచ్చామని, కమిటీ వేయాలని ఆదేశించామని గుర్తు చేసింది. దీనిపై తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు కోర్టుకు అందజేయలేదని ప్రశ్నించింది. ఫీజుల నియంత్రణపై తిరుపతి రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఇక అధిక ఫీజులు వసూలు చేస్తోందంటూ ఫిర్యాదు వచ్చిన హైదరాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది.  ఇక నుంచి ఇలాంటి విషయాల్లో సీరియస్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: