అధికారం లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేసిన తప్పిదాలు ఇప్పుడు ఆ పార్టీని వెంటాడుతున్నాయా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది . అధికారం లో ఉన్నప్పుడు అపరేషన్ ఆకర్ష్ పేరిట ఎక్కడైతే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చిన ఎమ్మెల్యేలను టీడీపీ నాయకత్వం చేరదీసిందో, అక్కడ ఇప్పుడు టీడీపీ ఎదురుదెబ్బ తగులుతోంది  . జమ్మలమడుగు లోరామసుబ్బారెడ్డి ని కాదని  టీడీపీ నాయకత్వం , ఆదినారాయణరెడ్డి ని పార్టీ లో చేర్చుకుని ప్రోత్సహించింది . ఇటీవల జరిగిన అసెంబ్లీ  ఎన్నికల అనంతరం ఆదినారాయణ రెడ్డి టీడీపీ కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరిన విషయం తెల్సిందే .

 

ఇక ఇన్నాళ్ళూ టీడీపీ లో కొనసాగిన రామసుబ్బారెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షం లో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు . ఇక అద్దంకిలోను అదే పరిస్థితి కన్పిస్తోంది . అద్దంకిలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చిన గొట్టిపాటి  రవికుమార్ ను టీడీపీ లో చేర్చుకుని  , పార్టీ సీనియర్ నేత కరుణం బలరాం ను పార్టీ నాయకత్వం  విస్మరించిన విషయం తెల్సిందే . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను రవికుమార్ కు సీటు కేటాయించిన టీడీపీ నాయకత్వం , కరుణం బలరాం కు చీరాల నుంచి  పోటీ చేయాలని ఆదేశించింది .

 

అయితే పార్టీ నాయకత్వం నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కరుణం బలరాం , ఎన్నికల కు ముందే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి అద్దంకి నుంచి ఆ పార్టీ తరుపున పోటీ చేస్తారన్న ఊహాగానాలు విన్పించాయి  . కానీ ఆయన ఎందుకో అంతటి సాహసాన్ని మాత్రం చేయలేదు . చీరాల నుంచి పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ పై విజయం సాధించారు కానీ పార్టీ నాయకత్వం పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కరుణం బలరాం ... ఇప్పుడిక టీడీపీ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: