గుంటూరు జిల్లా మాచర్ల వద్ద ఒక వ్యక్తి కర్ర తీసుకుని కారుపై దాడి చేసిన దాడి ఘటనపై

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ఆవేశపడ్డారు. గుంటూరు జిల్లా మాచర్లలో తెలుగుదేశం నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు న్యాయవాది కిశోర్ ప్రయాణిస్తున్న వాహనంపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు.

బుద్దా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు న్యాయవాది కిశోర్ లను వెంబడించి చంపేసే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.

 

 

అసలు ఈ రాష్ట్రంలో న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం ఉన్నాయా? అని చంద్రబాబు ఆవేశంగా ప్రశ్నించారు. బుద్దా వెంకన్న, బొండా ఉమపై హత్యాయత్నం జరిగితే ఏం చేస్తున్నారు. చంపేస్తారా? చంపండి !.. అంటూ ఆవేశంతో చంద్రబాబు ఊగిపోయారు.. తమాషా ఆటలు ఆడుతున్నారా అంటూ ప్రశ్నించారు.

 

 

మాచర్ల ఘటన కచ్చితంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారి దౌర్జన్యమేనని చంద్రబాబు ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ ఘటన లో చంద్రబాబు ఆవేశపడుతూ మాట్లాడటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ ఇదే చంద్రబాబు గతంలో వైసీపీ నేతలపై జరిగిన అనేక దాడుల విషయంలో నోరు మెదపలేదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు

 

 

ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షిస్తారని.. కానీ చంద్రబాబు మరీ ఆవేశపడిపోతూ మాట్లాడుతున్నారని వారు అంటున్నారు. అం తే కాక.. బుద్దా వెంకన్న కారు ఓ వికలాంగుడిని ఢీకొట్టి దూసుకుపోవడం వల్లే ఈ దాడి జరిగినట్టు మరో వాదన వినిపిస్తోంది. బోండా ఉమా, బుద్ధా వెంకన్నలకు మాచర్లలో పనేంటీ..? ఎన్నికల కోడ్‌ ఉంటే పది వాహనాల్లో ర్యాలీ చేస్తారా..? వాహనాలకు పర్మిషన్‌ ఉందా..? అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ను ధిక్కరించి విజయవాడ నుంచి గుండాలను తీసుకెళ్లి రౌడీయిజం చేయించారని మండిపడ్డారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: