ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ ను ప్రపంచ వ్యాధిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (డబ్ల్యు హెచ్ ఓ ) ప్రకటించింది . చైనా నుంచి దాదాపు వంద దేశాలకుపైగా  కరోనా వైరస్ వ్యాధి విస్తరించింది .  కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి . కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు  ప్రపంచ వ్యాప్తంగా 4 , 291 మంది మరణించినట్లు    డబ్ల్యు హెచ్ ఓ  వెల్లడించింది . 

 

మరో లక్షా 18 వేలమంది కరోనా వైరస్ వ్యాధి సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది .   చైనా బయట రెండు వారాల వ్యవధి ఈ వ్యాధి గ్రస్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది .    చైనా లో ఇప్పటి వరకు 3 , 158 మంది మరణించగా , ప్రస్తుతం ఇటలీ లో ఈ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకుంది . చైనా తరువాత ఇటలీ అత్యధికంగా 631 మందు మృత్యువాత పడ్డారు . ఇరాన్ లో 291  మంది మరణించగా , దక్షిణ కొరియా లో 61 , అమెరికా లో 31 మంది , ఫ్రాన్స్ 33 , స్పెయిన్ లో 36  మంది మరణించారు .ఇంకా ప్రపంచం లోని పలు దేశాల్లో కరోనా వైరస్ వల్ల పలువురు మృతి చెందగా , భారత్ లో ఈ వ్యాధి 60 మందికి సోకినట్లు గుర్తించారు .

 

అయితే ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారు మాత్రమే కరోనా వైరస్ బారిన పడినట్లు    గుర్తించారు  . దీనితో టూరిస్ట్ విసాలపై భారత్ కీలక ప్రకటన చేసింది .  ఏప్రిల్ 15 వతేది వరకు అన్ని టూరిస్ట్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది .  దేశ వ్యాప్తంగా కరోనా అలర్ట్ ప్రకటించి , వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: