ఎన్నో దారుణాలు. నోటితో చెప్పకూడని నేరాలు లోకంలో జరుగుతున్నాయి.. నేరం చేయాలనే ఆలోచన, తప్పుడు దార్లో నడవాలనే ఆరాటం ఉన్న వాడిని ఏ చట్టం ఏమి చేయలేదని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడుతున్నాయి.. ఇక అడ్డదారులు తొక్కాలంటే హోదాతో పనిలేదు.. కేవలం మనిషి అయితే చాలు.. అతనికి అహంకారం ఉంటే అది అడిషనల్ క్వాలిఫికేషన్.. దానికి తోడు అధికారం ఉంటే ఇక తిరుగులేదనే భావన చాలా మందిలో ఉంది.. ఇది నిజమని నిరూపించే ఘటన జరిగింది.. ఆ వివరాలేంటో చూస్తే..

 

 

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన పోలీసులకు ఎంత రక్షణ ఉన్నదనే విషయాన్ని వేలెత్తి చూపుతుంది.. అందులో మహిళ అధికారులకు ఉన్న భద్రతలోని లోపాలను ప్రశ్నిస్తుంది.. ఎందుకంటే ఒక మహిళ సీఐపై చేయిచేసుకోవడం అంటే మామూలు విషయం కాదు.. ఇక ఏపీలో స్థానిక సమరంలో ఎన్నో అపశ్రుతులు చోటుచేసుకుంటుండగా ప్రస్తుతం జరిగిన ఈ ఘటన స్దానికంగా కలకలం రేపుతోంది.

 

 

ఇకపోతే ఏపీలో స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉండగా, గుంటూరు జిల్లా మాచర్లలో, తాజాగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ నేతలైన బొండా ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్లపై దాడి చేశారు. ఇంతటితో ఊరుకోకుండా నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం వన్‌టౌన్‌ సీఐ లలితపై సరుబుజ్జిలి మాజీ జడ్పీటీసీ లక్ష్మీనర్సమ్మ చేయిచేసుకున్నారు.

 

 

ఇదిలా ఉండగా ఇతన్ని క్యూలో రమ్మన్నందుకు సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంత జరిగినా ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, ఇతను అధికార పార్టీకి చెందిన నేత కావడంతోనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనకాడుతున్నారని స్థానిక ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.. కాగా తప్పు చేసిన వారు ఎంతపెద్ద వారైనా చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్లుతుందనే నిజాన్ని గ్రహించి ఆరోపణలు చేయాలని మరికొందరు వాదిస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: