ఆంధ్రప్రదేశ్‌ లో స్థానిక సంస్థల ఎన్నికల జోరందుకుంది. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఈ విషయం తెలిసిందే.. వీరి వ్యవహారం చాలా చేజారిపోయింది. రెండు పార్టీలు నామినేషన్ పేపర్లు చించేయడం, కొట్టుకోవడం, దాడులు చేయడం వరకు వెళ్లింది. అయితే.. బీజేపీతో  జనసేన పార్టీ కలసి స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను రగంలోకి దింపుతోంది. 

 


కాగా., ఈ ఎన్నికల నేపధ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా 70 సంవత్సరాల (బామ్మ) నల్లమోతు భారతి జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేశారు. 70 ఏళ్ల భారతి జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలై బరిలో నిలిచారని తెలిపారు. అయితే.. ఇప్పుడంతా 70 సంవత్సరా ముసలావిడ నామినేషన్ వేయతంపై అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదిలఉండగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆమెను అభినందించారు.

 


జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సందేహాలు తీర్చడం కోసం జనసేన పార్టీ ప్రత్యేక విభాగాన్ని నియమించింది. ఈ ప్రత్యేక విభాగాన్ని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సందేహాల నివృత్తి కోసం వీర్రాజు, కృష్ణారెడ్డి, సుధీర్‌ లను నియమించింది. వారి ఫోన్ నెంబర్లను కూడా అందులో కు తెచ్చారు.

 


ఇదిలఉండగా.. విజయవాడలో డీజీపీ కార్యాలయం ఎదుట టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. మాచర్లలో టీడీపీ నేతల మీద వైసీపీ యువజన విభాగం నేతలు దాడి చేశారన్నారు. వారు దాడి చేస్తున్న సమయంలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న, హైకోర్టు అడ్వొకేట్ కిశోర్ వారి నుంచి తప్పించుకుని వెళ్లారన్నారు. వైసీపీ నేతలు స్థానికంగా సమాచారం ఇస్తూ తమ మీద దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. .
.

మరింత సమాచారం తెలుసుకోండి: