జగన్మోహన్ రెడ్డిపై పరిమళ్ళ ధీరజ్ నత్వాని పెట్టిన ఒత్తిడి పనిచేయలేదా ? రిలయన్స్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబాని అంతటి వ్యక్తితో వచ్చిన నత్వాని జగన్ పై ఒత్తిడి పెట్టటానికి  చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం నత్వానిని రాజ్యసభకు ఎంపిక చేయటం వెనుక ఆసక్తికరమైన విషయం ఉందట.  జగన్ ముందు నత్వాని ఒత్తిడి పనిచేయని కారణంగానే చివరకు వైసిపి తరపునే రాజ్యసభకు నామినేషన్ వేశారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటికి రెండుసార్లు నత్వాని జార్ఖండ్ నుండి రాజ్యసభ ఎంపిగా పనిచేశారు. రెండుసార్లు కూడా స్వతంత్ర అభ్యర్ధిగానే పనిచేశారన్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా ఈయన స్టైల్ ఏమిటంటే డబ్బుకు లోటు లేదు కాబట్టి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేయటం అక్కడి పార్టీల ఎంపిలతో పాటు స్వతంత్ర ఎంపిలు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడుకుని ఓట్లేయించుకోవటం నత్వానికి బాగా అలవాటు. అంటే ఏ పార్టీ ఓట్లేయించుకున్నా ఆ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర ఎంపిగానే నత్వాని చెలామణి అయ్యేవారు.

 

అయితే ఇపుడు పై రాష్ట్రం నుండి అవకాశాలు లేవు. ఎందుకంటే ఉన్న రెండు రాజ్యసభ స్ధానాలను కాంగ్రెస్, బిజెపిల పంచేసుకన్నాయి. కాబట్టి అక్కడ ఈయన నిలబడినా ఓట్లు పడే అవకాశాలు లేవు. అందుకనే బయట రాష్ట్రాల మీద ఈయన కన్నుపడిం. ఇందులో భాగంగానే నాలుగు స్ధానాలు వచ్చే వైసిపిని ఎంచుకున్నారు. ఇదే విషయమై ముఖేష్ తో కలిసి వచ్చిన నత్వాని జగన్ తో మాట్లాడుతూ తాను స్వతంత్ర అభ్యర్ధిగానే పోటి చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

 

ఇక్కడే జగన్-నత్వాని మధ్య సమస్య మొదలైంది. పార్టీ లైన్ దాటి బయట వ్యక్తులకు రాజ్యసభ ఎంపిగా పంపే ప్రసక్తే లేదని జగన్ ముఖేష్ తో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అంటే నామినేషన్ వేయదలచుకుంటే వైసిపి అభ్యర్ధిగానే వేయాలి తప్ప స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేస్తానంటే మద్దతు ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగానే తేల్చి చెప్పారన్నమాట. దాంతో నత్వాని ప్లాన్ తల్లకిందులవ్వటంతో పాటు తన ఒత్తిడి జగన్ పై పనిచేయలేదని అర్ధమైపోయింది. చేసేది లేక చివరకు పార్టీ తరపున నామినేషన్ వేశాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: