దాదాపు ఐదేళ్ళ క్రితం తెలంగాణాలో బయటపడిన ఓటుకునోటు కేసు దేశంలో ఎంతటి సంచలనమైందో అందరికీ తెలిసిందే. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పీకల్లోతు ఇరుక్కుని హైదరాబాద్ ను వదిలి విజయవాడకు పారిపోయేలా చేసిన కేసది. తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఏమాత్రం లేవని తెలిసినా పార్టీ తరపున ఓ అభ్యర్ధని పోటిలోకి దింపాడు చంద్రబాబు. ప్రత్యర్ధి ఎంఎల్ఏ ఓటును కొనుగోలు చేసే క్రమంలో సాక్ష్యాధారాలతో పట్టుబడేసరికి చంద్రబాబు పరువంతా పోయింది. అరెస్టు చేయటమే మిగిలుందనే సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడకు పారిపోయొచ్చేశాడు.

 

మళ్ళీ ఇంత కాలానికి చంద్రబాబు ఇటువంటి వ్యూహానికే తెరలేపాడా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు కూడా గెలుపు అవకాశాలు లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్ధిని పొటిలోకి దింపబోతున్నట్లు చంద్రబాబు ప్రకటన చేయటం విచిత్రంగా ఉంది. ఎన్నికలు అనివార్యమైతే ప్రతి రాజ్యసభ ఎంపికి 35 ఓట్లు అవసరం. ఎంఎల్ఏల బలం ఆధారంగా వైసిపికి అవసరానికి మించే ఓట్లున్నాయి. కానీ టిడిపికి మాత్రం ఉన్నది 23 మంది ఎంఎల్ఏలే. ఇందులో కూడా ఎన్ని ఓట్లు పడతాయో అనుమానమే.

 

తమ పార్టీ ఎంఎల్ఏల ఓట్లు పడటమే అనుమానంగా ఉన్నపుడు ఇక పోటి చేయటం ఎందుకు ? ఎందుకంటే ప్రత్యర్ధి ఓట్లను కొనుగోలు చేయాలన్న వ్యూహంలో చంద్రబాబు ఉన్నాడా ? అనే అనుమానం పెరిగిపోతోంది. అందుకనే వ్యూహాత్మకంగా ఎస్సీ అభ్యర్ధిని రంగంలోకి దింపిన చంద్రబాబు ఆత్మప్రభోదం పేరుతో ఓట్లేయాలంటూ వైసిపి ఎంఎల్ఏలకు పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. ఆత్మప్రభోదం ప్రకారం ఓట్లేయాలని చెప్పటమంటే వైసిపి నుండి క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించటమనే అర్ధం.

 

చంద్రబాబు క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తున్నారంటే డబ్బులు పెట్టి ఓట్లు కొనాలన్న ఆలోచన చేస్తున్నాడా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. నిజంగా చంద్రబాబు ఆ పని గనుక చేస్తే టిడిపికి ఏపిలో కూడా ఇదే చివరి రోజవుతుందనటంలో సందేహమే లేదు. ఓటుకునోటు కేసు దెబ్బకే తెలంగాణాలో టిడిపి తుడిచిపెట్టుకుపోయిందన్న విషయం మరచిపోకూడదు. ఇపుడు ఏపిలో కూడా ఇటువంటి పనే చేస్తే  తనకు నిలువ నీడ కూడా ఉండదని చంద్రబాబు మరచిపోయినట్లున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: