మానవత్వాన్ని మరచి మృగాళ్లలా బ్రతకడానికి అలవాటు పడుతున్న నేటి రోజుల్లో కూడా మంచితనం, మానవతా విలువలను గౌరవించే వారు అక్కడక్కడ ఉన్నారు.. ఇలాంటి వారి కష్టాలకు కన్నీళ్లు కూడా బరువుగా మారుతాయి.. ఇక భార్యభర్తల బంధం అంటే వ్యాపార బంధంగా మారింది.. రాత్రి అయితేనే పెళ్ళాం గుర్తుకు వస్తుంది. ఇలాంటి వైవాహిక జీవితంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఒకరికొకరు సేవ చేసుకుంటూ మనో ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. కానీ ఇలా జరుగదు. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమో లేదా చెడు వ్యసనాలకు బానిసలుగా మారడమో జరుగుతుంది..

 

 

అయితే ఇప్పుడు మనం చెప్పుకునే భార్యభర్తల అన్యోన్యత, వారిద్దరి మధ్య ప్రేమ.. ఎంత బలమైనదో తెలుసుకుంటే, నిజంగా ఇలాంటి బంధం కూడా ఇంకా ఈ సమాజంలో బ్రతికి ఉందా అని అనిపిస్తుంది.. ఇక ఆ వివరాలు తెలుసుకుంటే క్యాన్సర్‌ బాధితురాలైన భార్య లిస్సితో కలిసి, 67 ఏళ్ల జోషి అలువలో నివాసముంటున్నాడు. అయితే వీరికి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలకు దూరంగా జీవిస్తున్నారు.. కాగా క్యాన్సర్‌తో బాధపడుతున్న లిస్సి భర్తను ఇంట్లోనే ఉంచి, తాను మాత్రం ఒంటరిగా కిమియోథెరపీ చికిత్స చేయించుకోవటానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె భర్త అయిన జోషీ ఇంటి సీలింగ్‌కు వేలాడుతూ కనిపించటంతో షాక్ తిన్న ఆమె, బాధనంతా పెదవి చాటున బిగపట్టి బిగ్గరగా అరవడంతో, ఆమె అరుపులకు ఇరుగు పొరుగు వారు పరుగుపరుగున అక్కడికి వచ్చారు.

 

 

అందులో ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు జరిగిన విషయం తెలుసుకుని తమ ఫార్మాలిటీస్‌ ప్రకారం ఉదయం వరకు బాడీని కిందకు దించడానికి వీల్లేదని చెప్పేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఆమె గుండెలు పగిలే దుఖముతో ఆ రాత్రి మొత్తం భర్త శవంతో గడపాల్సి వచ్చింది. ఇక మరుసటి రోజు ఉదయం అక్కడకు వచ్చిన పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.. కానీ భార్యకు క్యాన్సర్ ఉందని తెలిసి కూడా ఆమెతోపాటు జీవిస్తున్న ఆ భర్త ఇలా అర్ధాంతరంగా మరణించడంతో పాపం ఎప్పుడు మరణిస్తుందో తెలియని ఆ మహిళకు ఇదొక నరకం అని చెప్పవచ్చూ..

మరింత సమాచారం తెలుసుకోండి: