ఆ మద్య జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో కలకలం రేగింది. మల్లాపూర్ మండలానికి చెందిన సరికెల లింగన్న అనే వ్యక్తి కోసం జమ్మూ నుంచి పోలీసులు రావడంతో స్థానికులు ఒక్కసారిగా హులిక్కిపడ్డారు. దీనికి కారణం జమ్మూకాశ్మీర్‌లో రాకేష్ అనే వ్యక్తిపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్మీకి సంబంధించిన సమాచారం క్యాంపస్ నుంచి బయటకు లీక్ చేస్తున్నాడన్న అనుమానంతో జమ్మూకాశ్మీర్ పోలీసులు రాకేశ్‌పై కేసు నమోదు చేశారు.  రాకేష్ బ్యాంక్ అకౌంట్‌కి మల్లాపూర్ మండలం కుస్థాపూర్‌కి చెందిన సరికెల లింగన్న అనే వ్యక్తి ఫిబ్రవరిలో 15న రూ. 5వేలు,  23న 4వేల రూపాయలు పంపించడం జరిగింది.

 

 సైన్యం రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో బుధవారం రాత్రి జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు మరోసారి మెట్‌పల్లికి వచ్చారు. నగదు బదిలీ చేసిన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్న(35)ను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌తో జమ్మూకు తరలించారు. జమ్మూ-కశ్మీర్‌ ఆర్మీ క్యాంపులో కార్మికుడిగా పనిచేసే రాజేశ్‌ అనే యువకుడు సైన్యం సమాచారాన్ని అనిత అనే మహిళకు చేరవేస్తున్నాడన్న ఫిర్యాదుపై జనవరిలో కేసు నమోదైంది.

 

ఈ నేపథ్యంలో  సరికెల లింగన్న ఖాతా నుంచి ఫిబ్రవరి 13న రూ.5 వేలు, 20న రూ.40 వేలు జమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన అక్కడి పోలీసులు ఈ నెల 3న ఇక్కడికి వచ్చి లింగన్నను అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు అతన్ని మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.  ఇదిలా ఉంటే ఆ రోజు వారెంట్‌ లేకుండా రావడంతో లింగన్న అరెస్ట్‌కు మెట్‌పల్లి జడ్జి అంగీకరించలేదు. దీంతో జమ్మూ కోర్టు నుంచి వారెంట్‌ కాపీతో పోలీసులు మళ్లీ బుధవారం రాత్రి మెట్‌పల్లికి చేరుకుని లింగన్నను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌తో అతన్ని జమ్మూకు తరలించారు.  తాజాగా ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: