ముద్దులొలికే చిన్నారులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. పిల్లలతో హాయిగా ఆడుకొంటుంటే సమయం తెలియక గడిచిపోతుంది.. అలసట అంతా మాయం అవుతుంది.. ఇక చిన్న వయస్సు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పసితనం కదా.. పాముకు తాడుకు తేడా తెలియదు.. పిల్లలుగల తల్లిదండ్రులు ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది.. అందుకే పసిపిల్లలపట్ల చాలా జాగ్రత్త వహించాలంటారు..

 

 

ఇకపోతే పిల్లలు తెలియక ఏదిపడితే అది నోట్లో పెట్టేసుకుని ప్రమాదాల బారిన పడతారు.. ఇదిగో ఇలాగే ఓ 14 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.. ఈ విషాద ఘటన మంగళవారం రాస్ అల్ ఖైమాలో చోటుచేసుకుంది. చిన్నారి గొంతులో చిప్స్ ఇరుక్కుపోవడం... అది కాస్తా శ్వాసనాళానికి అడ్డుపడడంతో ఆమెకు ఊపిరితీసుకోవడం కష్టంగా మారడం గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆమెను తలకిందులుగా చేసి గొంతుకు అడ్డుపడిన చిప్స్‌ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అక్కడ కూడా చిన్నారిని కాపాడేందుకు వైద్యులు, శతవిధాల ప్రయత్నించారు.. కాని లాభం లేకపోయింది..

 

 

అప్పటికే శ్వాసనాళం మూసుకుపోవడంతో చిన్నారి మెదడుకు ఆక్సిజన్ అందక ఆమె ముఖం మొత్తం నీలంగా మారిపోయిన కాసేపటికే, చిన్నారి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో ఆ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడ ఉన్న ప్రతి వారిని కలిచివేసింది. తెలియక పాప చేసిన తప్పు, అన్ని తెలిసి పాపను అలా నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిదండ్రుల వల్ల ఒక నిండు ప్రాణం పోయింది..

 

 

ఇక ఇదే తరహాలో రెండేళ్ల బాలుడి గొంతులో ద్రాక్ష ఇరుక్కుని చనిపోయీన ఘటన రాస్ అల్ ఖైమాలోనే 2018లో జరిగింది.. వీరే కాకుండా పిల్లలు వివిధ ప్రమాద ఘటనల్లో మరణించడం తరచుగా వినిపిస్తున్నదే.. పాపం చిన్నారులు జీవితాన్ని చూడకుండానే ఇలా అకస్మాత్తుగా ప్రమాదాల బారిన పడుతున్న, పెద్దల్లో మార్పు రావడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: