రాజ్యసభ ఎన్నికల్లో వైసిపి ఎంఎల్ఏలు ఆత్మ ప్రభోదంతో ఓట్లేయాలంటూ చంద్రబాబునాయుడు, వర్ల రామయ్య ఇచ్చిన పిలుపు పెద్ద జోక్ గా తయారైంది. అసలు గెలుపు అవకాశాలే లేని ఎన్నికలో పోటి చేయటమే తుగ్లక్ చర్యగా జనాలు అనుకుంటున్నారు. అలాంటిది మళ్ళీ ఆత్మ ప్రభోదం మేరకు ఓట్లేయాలని పిలుపివ్వటం క్యామిడి కాకపోతే మరేమిటి ?  చింత చచ్చిన పులుపు చావలేదనే సామెతే జనాలకు గుర్తుకొస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగు రాజ్యసభ స్ధానాలు భర్తీ అవుతున్నాయి. అసెంబ్లీలో ఎంఎల్ఏల బలం ప్రకారం నాలుగు సీట్లూ వైసిపికే దక్కుతాయనటంలో సందేహం లేదు. ఇక్కడే చంద్రబాబు ఓ పిచ్చి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే పార్టీ తరపున ఓ అభ్యర్ధిని పోటిలో దింపుతారట. అదెవరయ్యా అంటే ఎస్సీ నేత వర్ల రామయ్య. మామూలుగానే వర్ల చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడనే పేరుంది. దానికి తోడు రాజ్యసభకు పోటి చేసే అభ్యర్ధి అని చంద్రబాబు అధికారికంగా తన పేరు ప్రకటిస్తే ఇక ఊరుకుంటాడా ?

 

ఇపుడు జరిగిందిదే. వైసిపి ఎంఎల్ఏలు ఆత్మప్రభోదం మేరకు ఓట్లేయాలని పిలిపిచ్చేశాడు. అంబేద్కర్ ఆశయ సాధనకు తనలాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండటమే కరెక్టని అప్పుడే ఆయనకు ఆయన ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసుకున్నాడు.  కాబట్టి వైసిపి వాళ్ళు కూడా తనకే ఓట్లేయాలని తీర్మానించేశాడు. తనకు వైసిపి ఎంఎల్ఏలు ఓట్లేస్తేనేమో ఆత్మప్రభోదం మేరకు ఓట్లేసినట్లట. అలా కాకుండా వాళ్ళ పార్టీ అభ్యర్ధులకే గనుక ఓట్లేసుకుంటే జగన్ కు భయపడే ఓట్లేసినట్లు అని ఓ తీర్మానం కూడా చేసేశాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొన్నటి సాధారణ ఎన్నికల్లో జనాలు ఆత్మ ప్రభోదంతో ఓట్లేస్తే ఏమైంది ? తెలుగుదేశంపార్టీకి చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా 23 సీట్లొచ్చాయి. అయినా ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు పార్టీకి. జగన్ పై ఎలాగైనా  బురదచల్లాలి, ఎంత వీలుంటే అంతా గబ్బు పట్టించాలన్న ఏకైక టార్గెట్ తో పనిచేస్తున్న చంద్రబాబుకు వర్ల లాంటి వాళ్ళు ఆజ్యం పోస్తున్నారు. అసలు టిడిపి 23 ఓట్లూ పడతాయా అన్నదే అనుమానం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: