మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో పుట్టిన వైసీపీ నేడు పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీని ఎదురించి జగన్ వైస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మార్చి 11, 2011న వైసీపీని స్థాపించారు. జగన్ స్థాపించిన వైసీపీ నేడు మహావృక్షంగా ఎదిగి ఎందరికో రాజకీయ భవిష్యత్ ఇస్తోంది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాల్లో, 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే వైసీపీ సరికొత్త రికార్డులు సృష్టించింది. 

 

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఎంతోమంది వైసీపీ పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్ళలోకి అడుగుపెట్టినందుకు అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ తరహాలోనే విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి నేటితో పది వసంతాలు. ఈ పదేళ్ళ ప్రస్థానంలో పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్‌ జగన్‌ అకుంఠిత దీక్ష, పట్టుదలలే ప్రేరణగా ఆయన అడుగుజాడల్లో నడిచి పల్లెస్థాయి నుంచి పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. శుభాభినందనలు.'' అంటూ ట్విట్ చేశారు. 

 

దీంతో ఈ ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ట్విట్ తో పాటు మరో ట్విట్ కూడా చేశారు.. ఎం అని చేశారు అంటే? విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో అయన వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. దీంతో ఆ వేడుకలలో అయన పాల్గొన్న చిత్రాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్విట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: